ETV Bharat / health

మీ ఒంట్లో సరిపడా రక్తం లేదా? ఇది తీసుకుంటే రక్తహీనత సమస్యకు చెక్! - BLOOD IMPROVE TIPS IN TELUGU

-రక్తహీనతతో ఇబ్బంది బాధపడుతున్నారా? -ఆయుర్వేద పద్ధతిలో రక్తహీనతను తగ్గించే ఔషదం

Blood Improve Tips in Telugu
Blood Improve Tips in Telugu (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 5 hours ago

Blood Improve Tips in Telugu: మీ శరీరంలో సరిపడా రక్తం లేక రక్తహీనతతో బాధపడుతున్నారా? దీంతో రక్తం పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే, ఆయుర్వేద పద్ధతిలో చేసే ఈ ఔషధాన్ని ప్రిపేర్​ చేసుకుని తింటే రక్తం వేగంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధాన్ని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

  • 160 గ్రాముల ఉసిరి పెచ్చుల చూర్ణం
  • 80 గ్రాముల లోహాభస్మం
  • 40 గ్రాముల యష్టి మధు చూర్ణం
  • 80 గ్రాముల తిప్ప తీగ చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో ఉసిరి పెచ్చుల చూర్ణం, లోహాభస్మం, యష్టి మధు చూర్ణం వేసి కలపాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో తిప్ప తీగ చూర్ణం పోసి వేడి చేసుకోవాలి.
  • తిప్ప తీగ కషాయం మనం పోసిన నీటిలో 4వ వంతు వచ్చే వరకు మరిగించుకోవాలి.
  • అనంతరం స్టౌ ఆఫ్ చేసి ఈ కషాయాన్ని వడపోసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చిన్న రోలును తీసుకుని ముందుగా కలిపిన మిశ్రమాన్ని, కషాయాన్ని పోసి 15 నిమిషాల పాటు బాగా నూరాలి.
  • అనంతరం అందులోనే ఒకరోజు మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఏడు రోజుల పాటు కషాయాన్ని, మిశ్రమాన్ని పోసి నూరి నానబెట్టుకోవాలి.
  • ఇలా చేసిన తర్వాత చివరకు ముద్దలాగా తయారైన తర్వాత మాత్రలుగా చేసుకోని నీడలో ఆరబెట్టుకుంటే ఔషధం రెడీ అవుతుంది.
  • ఈ మాత్రని ఉదయం, సాయంత్రం భోజనం చేసిన తర్వాత వేసుకోవాలని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. మనకు ఉన్న రక్త హీనత శాతాన్ని బట్టి సుమారు రెండు నెలల పాటు వాడాలని సూచిస్తున్నారు.

ఉసిరి పెచ్చులు: మనలో విటమిన్ సీ లోపం వల్ల రక్త హీనత సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు. రక్త కణాలు ఉత్పత్తి కావడానికి ఉసిరి బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

లోహాభస్మం: ఇది మన శరీరంలో ఐరన్ స్థాయిలు పెరగడానికి ఎంతో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తం పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

యష్టి మధు: మనలో కొంత మందికి ఐరన్ వాడిన సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా కడుపు నొప్పి, మంట ఉన్నవారికీ కూడా ఇది సహాయ పడుతుందని వివరిస్తున్నారు.

తిప్ప తీగ: ఇది రక్త హీనత సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు. రక్తం పెంచడానికి మంచి టానిక్​లాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ లివర్ క్లీన్ కావాలా? ఇలా చేస్తే కాలేయం సేఫ్! ఎలానో తెలుసా?

జిడ్డు చర్మం పోయి గ్లోయింగ్ స్కిన్ కావాలా? నిమ్మతో ఇలా చేస్తే చాలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.