ETV Bharat / spiritual

అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? - SHIVARATRI SIGNIFICANCE

సర్వం శివమయం - మహాశివరాత్రి విశిష్టత

Significance Of Shivaratri
Significance Of Shivaratri (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 3:19 AM IST

Significance Of Shivaratri : హిందువుల పండుగలలో సంక్రాంతి తరువాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి రోజును మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మనం మహా శివరాత్రిగా జరుపుకుంటాం. శివ పురాణం ప్రకారం మహా శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించినట్లుగా తెలుస్తోంది. అసలు మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటాం? మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహాశివరాత్రి విశిష్టత
సాధారణంగా మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. అదే ఈ పండుగ యొక్క విశిష్టత. హిందూ సంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే, శివుని మాత్రం లింగాకారంలో పూజిస్తాం.

శివలింగ ఆవిర్భావ ఘట్టం
మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి, శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం, ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప? అనే చర్చ మొదలైంది. చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివాన అయింది. ఎవరికి వారు తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలు పెట్టారు.

శివుని మధ్యవర్తిత్వం
ఆ సమయంలో బ్రహ్మ, విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుని మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థం అని తెలియ చెప్పటానికి, శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్ని స్తంభం లాగా, లింగాకారంలో ఆవిర్భవించాడు.

ఆది అంతములను కనుగొనమన్న మహేశ్వరుడు
అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణువులకు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ఈ అగ్ని స్తంభం ఆది, అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతాడు. అప్పుడు బ్రహ్మ హంస రూపంలో అగ్ని స్తంభం అంతాన్ని కనుగొనడానికి పైకి, విష్ణువు వరాహ రూపంలో అగ్ని స్తంభం మొదలును కనుగొనడానికి కిందికి వెళ్లారు. కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోయారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా వారు ఆద్యంతాలును కనుగొనలేదు.

బ్రహ్మ కపట బుద్ధి
అంతట బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకి పుష్పాన్ని, కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్ని స్థంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా, విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడసోపచార పూజలు చేస్తాడు.

కేతకి పుష్పం, కామధేనువుని సాక్ష్యం కోరిన శివుడు
అగ్ని స్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకి పుష్పాన్ని, కామధేనువును శివుడు వివరము అడుగగా, బ్రహ్మ అగ్ని స్తంభం అంతాన్ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం బ్రహ్మ అగ్ని స్తంభం అంతం చూడడం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.

విష్ణువుకు వరం
మోసం చేసిన బ్రహ్మను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్య వాక్యానికి సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపం!
ఆ సమయంలో, శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించెను. ఆనాటి నుంచి ఎవరూ బ్రహ్మను పూజించరని, బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని శివుడు శాపం ఇచ్చెను. అందుకే బ్రహ్మ ఆలయాలు కానీ, పూజలు కానీ ఉండవు.

కేతకి పుష్పాన్ని కామధేనువును శపించిన శివుడు
అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోపోద్రిక్తుడైన శివుడు ఆనాటి నుంచి మొగలిపువ్వుకు పూజార్హత లేదని, అలాగే గోవుకు తోకకు మాత్రమే పూజ ఉంటుందని శపిస్తాడు.

లింగోద్భవ కాలం
ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్ని స్తంభంలా, లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రి గా జరుపుకుంటాం. ఆనాటి నుంచి పరమ శివుని ఆద్యంత రహితుడని పూజించసాగారు. అంటే ఆది కానీ, అంతం కానీ లేని దేవుడని అర్థం. ఆలయాలలో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికీ చదివిన వారికీ శాశ్వత శివసాయుజ్యం లభిస్తుందని శాస్త్ర వచనం. ఓం నమః శివాయ

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.