ETV Bharat / international

ట్రూడోకు బిగ్​ షాక్- అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు NDP రెడీ- ఇక అంతే సంగతి! - CANADA POLITICS

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని ఎన్​డీపీ

No Confidence Motion on Canada PM
Canada PM Trudeau, Jagmeet Singh (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2024, 10:46 AM IST

No Confidence Motion on Canada PM : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమొక్రటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ) షాక్​ ఇచ్చింది. ట్రూడో లిబరల్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఎన్‌డీపీ నేత జగ్మీత్‌సింగ్ పేర్కొన్నారు. కెనడియన్లను ఉద్దేశిస్తూ ఆయన ఈ మేరకు ఓ లేఖ రాసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఈ లేఖపై ట్రూడో ప్రభుత్వం స్పందించలేదు.

'జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రజల కోసం కాకుండా, శక్తిమంతుల కోసం ట్రూడో పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తాం. హౌస్ ఆఫ్‌ కామన్స్‌ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం' అని ఎక్స్​లో పేర్కొన్నారు. అయితే, ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే 9 ఏళ్ల ట్రూడో పాలన ముగిసిపోతుంది.

ఆ దేశ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్‌ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపుపొందిన ఆమె, ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సరిహద్దులో వలసలు, డ్రగ్స్‌ అక్రమరవాణాను కట్టడి చేయకుంటే కెనడాపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలు అంటించారు. అయినా ఈ విషయాల్లో సరిగా స్పందించడం లేదని సొంత పార్టీ నేతల నుంచే జస్టిన్‌ ట్రూడో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విశ్వాసతీర్మానంపై ఓటింగ్‌లో ట్రూడో సర్కారు ఎన్‌డీపీ మద్దతుతో గట్టెక్కింది. మరోవైపు జగ్మీత్‌సింగ్‌ ఖలిస్థానీ వేర్పాటువాదానికి బలమైన మద్దతుదారులు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్‌తో విభేదాలను పెంచి పెద్దవి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే ట్రూడో పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు బహిరంగంగా పిలుపునిచ్చాయి. మరోవైపు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.