Stock Market Today 23 January 2024 :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమై, భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, టెక్, మెటల్ షేర్లు భారీగా పతనం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1053 పాయింట్లు నష్టపోయి 70,370 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 333 పాయింట్లు కోల్పోయి 21,238 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సెర్వ్
- నష్టపోయిన షేర్లు : ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, విప్రో
జీ-ఎంటర్టైన్మెంట్ షేర్ల పతనం
ZEE Shares : సోనీ కంపెనీ విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు భారీగా (30%) పతనం అయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ షేర్లు కూడా బాగా నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్స్
Global Markets 23 January 2024 : ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్, చైనాకు చెందిన షాంఘై మంచి లాభాలతో స్థిరపడ్డాయి. జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
FII Investments In India : ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శనివారం రూ.545.58 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.