తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - 1300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌​ - నిఫ్టీ 430 పాయింట్లు ప్లస్

Stock Market Updates
Stock Market Updates (ANI)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

Stock Market Updates November 25th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలు, మహారాష్ట్రలో ఎన్​డీఏ కూటమి విజయం, గత వారం నష్టాల నుంచి కొంత రికవరీ కనిపించడం వల్ల సూచీలు సానుకూలంగా స్పందించాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 1261 పాయింట్లు పెరిగి 80,378 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 397.5 పాయింట్లు పెరిగి రూ.24,305 వద్ద కొనసాగుతోంది. లార్సెన్‌ అండ్​ టూబ్రో, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, రిలయన్స్, ఐసీఐసీఐ షేర్లు లాభల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

LIVE FEED

12:21 PM, 25 Nov 2024 (IST)

లాభాల్లో అదానీ గ్రూప్ కంపెనీలు

అదానీ గ్రూపునకు చెందిన తొమ్మిది కంపెనీల షేర్లు సోమవారం లాభల్లో ప్రారంభమయ్యాయి. అదానీ ఎర్జీస్ దాదాపు 7 శాతం మేర పెరిగింది. బిఎస్‌ఈలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 6.89 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6.42 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.33 శాతం, అదానీ పోర్ట్స్ 4.64 శాతం, అదానీ పవర్ 4.17 శాతం పుంజుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4 శాతం, అదానీ విల్మార్ 3.23 శాతం, ఏసీసీ 3 శాతం, అంబుజా సిమెంట్స్ 2.71 శాతం షేర్లు పెరిగాయి. అయితే ఎన్​డీటీవీ షేర్లు 2 శాతం తగ్గాయి.

11:31 AM, 25 Nov 2024 (IST)

1300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌

  • భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
  • 1300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌
  • 430 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details