Gas Cylinder Price Today :వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.5 మేర తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1804కు చేరింది. ముంబయిలో రూ.1756, కోల్కతాలో రూ.1911, చెన్నైలో రూ.1966గా ఉంది.
గత ఐదు నెలలుగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుతూ వస్తోంది. చివరగా 2024 డిసెంబర్ 1న 19 కిలోల వంట గ్యాస్ బండ ధర రూ.16.5 మేర పెరిగింది. ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు ఎల్పీజీ ధరను స్వల్పంగా తగ్గించాయి చమురు సంస్థలు. అయితే, గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803గా ఉంది.
మరోవైపు, విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్ ధరను చమురు సంస్థలు కిలోలీటరుకు రూ.1401.37 మేర తగ్గించాయి. ప్రస్తుతం దిల్లీలో ఒక కిలోలీటరు ఏటీఎఫ్ ధర రూ.90,455.47గా ఉంది.