How To Get Top Up On Car Loan :ఎవైనా అనుకోని ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు కొత్తగా లోన్‌కు అప్లై చేసి, వేచి చూడాల్సిన అవసరం లేకుండా కారు లోన్‌పై టాపప్ సహాయపడుతుంది. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి బ్యాంకులు సులభంగానే ఈ రుణాలను ఇస్తాయి. ఈ టాపప్ లోన్లను మీ వ్యక్తిగత అవసరాలకూ వాడుకోవచ్చు. లేదా కారు మరమ్మతు కోసమూ ఉపయోగించుకోవచ్చు.
కారు లోన్ టాపప్ విషయంలో ముఖ్యమైన అంశాలు ఇవే
- కారు లోన్ టాపప్ దరఖాస్తును బ్యాంకులు చాలా వేగంగా ఆమోదిస్తాయి.
- లోన్ అప్లికేషన్ ఆమోదం పొందిన వెంటనే అకౌంట్లో డబ్బును జమ చేస్తాయి.
- సాధారణంగా ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేకుండా బ్యాంకులు టాపప్ లోన్లను అందించే అవకాశం ఉంది. కొన్నిసార్లు అదనంగా డాక్యుమెంట్లు కావాలని చెప్పొచ్చు.
- టాపప్ లోన్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. బ్యాంకు శాఖకు వెళ్లి అప్లై చేయాల్సిన పనిలేదు. ఇప్పటికే లోన్ తీసుకున్న బ్యాంకు వెబ్‌సైటు లేదా యాప్ నుంచి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ టాపప్ లోన్‌కు వాహన రుణానికీ సాధారణ వాహన రుణానికి ఉండే వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొన్నిసార్లు అరశాతం ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది.
- ఇప్పటికే వాహన లోన్‌ను ఇచ్చిన బ్యాంకు దగ్గర మన కారు హామీగా ఉంటుంది. కనుక, టాపప్ లోన్ కోసం ప్రత్యేకంగా తనఖా అవసరం ఉండదు.
- టాపప్ లోన్ పొందడం సులభమే అయినా బ్యాంకు లేదా రుణాన్ని మంజూరుచేసే ఆర్థిక సంస్థ నిబంధనలను గమనించాలి. కొన్ని బ్యాంకులు పర్సనల్ లోన్‌గా పేర్కొంటూ13-14 శాతం వరకూ వడ్డీని విధిస్తాయని గుర్తుంచుకోండి.
కారు లోన్ - గుర్తించుకోవాల్సిన అంశాలు ఇవే!
వాహన రుణాన్ని తీసుకోవాలనుకునే ముందు ఏయే విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఏవిధంగా చేస్తే లోన్‌ను వేగంగా పొందవచ్చు. కారు లోన్ తీసుకునేందుకు ఆర్థిక ప్రణాళిక ఏవిధంగా ఉంటే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం