Smriti Mandhana ODI Century : రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగిపోయింది. 70 బంతుల్లో 100 పరుగులు సాధించి అత్యంత వేగంగా శతకం బాదిన మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండగా, ఇప్పుడు ఆ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండో వన్డేలోనూ ఆమె శతకం చేసింది.
ఇక ఈ మ్యాచులో స్మృతి 135 పరుగులు చేసి ఔట్ అయ్యింది. మొత్తం 80 బంతుల్లో 135 పరుగులు చేసి వెనుతిరిగింది. అయితే సెంచరీ తర్వాత మరో 10 బంతుల్లోనే 35 పరుగులు స్కోర్ చేయడం విశేషం. అయితే తొలి వికెట్‌కు ప్రతీక రావల్‌తో కలిసి స్మృతి 233 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
మ్యాచ్ ఎలా సాగిందంటే?
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలిసారి వన్డేల్లో 400కిపైగా పరుగులు సాధించి రికార్డుకెక్కింది. కెప్టెన్ స్మృతి మంధాన (135), మరో ఓపెనర్ ప్రతీకా రావల్ (154) శతకాలతో చెలరేగి టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ అర్ధ సెంచరీ నమోదు చేసినప్పటికీ 59 వద్ద పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమ్ఇండియా 435 పరుగులను స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో స్మృతి నమోదు చేసిన రికార్డులు ఇవే :
వన్డే క్రికెట్‌లో 500+ బౌండరీలు బాదిన రెండో భారత మహిళా బ్యాటర్‌గా రికార్డు.
వన్డే క్రికెట్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాల్గవ మహిళా క్రికెటర్‌గా ఘనత.
వన్డేల్లో స్మృతికి ఇది పదో శతకం కావడం విశేషం.