Bharat Mobility Global Expo 2025 :భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 మొదటి రోజు బంపర్ హిట్ అయ్యింది. మారుతి సుజుకి, టాటా, టయోటా, హ్యుందాయ్ బీఎండబ్ల్యూ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ త్వరలో లాంఛ్ చేయనున్న తమ లేటెస్ట్ మోడల్ కార్లను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించాయి. వాటిలో ప్రధానంగా హ్యుందాయ్ క్రెటా, మారుతి ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ బీఈవీ, టాటా కంపెనీకి చెందిన సియెర్రా, హారియర్ ఈవీ, స్టెల్త్ ఎడిషన్లు, బీఎండబ్ల్యూ iX1 LWB ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Maruti e Vitara : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ కారు అయిన ఈ-విటారాను ఆవిష్కరించింది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 500 కి.మీ అని కంపెనీ చెబుతోంది.
2. Toyota Urban Cruiser BEV : టయోటా ఈ ఎక్స్‌పోలో అర్బన్ క్రూయిజర్ బీఈవీ కారును ప్రదర్శించింది. మారుతి ఈ-విటారానే రీ-బ్యాడ్జ్ చేసి దీనిని తీసుకువచ్చారు. ఇది కూడా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
3. Hyundai Creta Electric : ఈ ఎక్స్‌పోలో హ్యుందాయ్ కంపెనీ తమ లేటెస్ట్ క్రెటా ఈవీని ప్రదర్శించింది. దీని ధర బహుశా రూ.17.99 లక్షలు - రూ.23.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. కంపెనీ దీని డ్రైవింగ్ రేంజ్ 473 కి.మీ అని చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఇంకా బాస్ మోడ్, డిజిటల్ కీ, ఫోల్డబుల్ ట్రే, డ్రైవర్ సీట్ మెమొరీ సెట్టింగ్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
4. Tata Cars 2025 : టాటా కంపెనీ ఈ ఎక్స్‌పోలో తమ అప్‌కమింగ్ కార్లను ప్రదర్శించింది. అందులో నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీ ఉన్నాయి. అలాగే సియోర్రా ఐసీఈ, అవిన్యా క్రాస్‌ఓవర్‌లను కూడా ఆవిష్కరించింది.