తెలంగాణ

telangana

ETV Bharat / business

బెస్ట్​ స్పోర్ట్స్​ బైక్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే? - Best Sports Bikes - BEST SPORTS BIKES

Best Sports Bikes In india : మీకు స్పోర్ట్స్​ బైక్స్​ అంటే ఇష్టమా? కొత్త సూపర్​ బైక్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సూపర్ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే బెస్ట్​-5 స్పోర్ట్స్​ బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 5 Sports Bikes In india
Best Sports Bikes In india

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 5:13 PM IST

Best Sports Bikes In india : భారత్​లో బైక్స్​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్​ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే స్పోర్ట్స్​ బైక్​లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలోని టాప్​​-5 సూపర్​ బైక్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. BMW G310 RR :సూపర్ రైడింగ్ ఎక్స్​పీరియెన్స్​ కావాలనుకునే వారికి బీఎమ్​డబ్ల్యూ జీ310 ఆర్​ఆర్​ మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 312.12 సీసీ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్​ మాన్యువల్ ట్రాన్సిషన్​తో ఈ బైక్​ వస్తోంది. దీని మైలేజీ 30 కి.మీ/లీటర్​. మార్కెట్​లో ఈ స్పోర్ట్స్​ బైక్ ధర సుమారుగా రూ.3,04,304 (ఎక్స్​ షోరూమ్) ఉంటుంది.

2. Ducati Monster :సూపర్​ కార్​ బ్రాండ్​ అయిన డుకాటీ విడుదల చేసిన బైక్​ డుకాటీ మాన్​స్టర్. ఈ సూపర్​ స్టైలిష్​​ మోడల్ మంచి డైనమిక్​, స్పోర్టీ లుక్​ కలిగి ఉంటుంది. పేరుకు తగ్గట్టే దీనిలో అత్యంత శక్తిమంతమైన 937 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. 6 స్పీడ్​ మాన్యువల్ ట్రాన్సిషన్​తో వస్తుంది. ఈ బైక్​ సీట్​ హైట్​ 820 mm. దీనిపై లీటర్ పెట్రోల్​తో 19 కి.మీ ప్రయాణించవచ్చు. మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.12,94,366 ఉంటుంది.

3. Kawasaki Ninja ZX-4R : ప్రముఖ టూవీలర్​ తయారీ సంస్థ కవాసకి - స్పోర్ట్స్​ బైక్​లకు చాలా ప్రసిద్ధి. ఈ కంపెనీ నుంచి వచ్చిన సూపర్​ స్పోర్ట్స్​ బైక్​ కవాసకి నింజా జెడ్​ఎక్స్​-4ఆర్. ఈ ఛార్మింగ్​ బైక్​లో 399 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 76.4 bhp పవర్​ జనరేట్ చేస్తుంది. సీట్​ హైట్​ 800 mm. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.8,49,000 ఉంటుంది.

4.Triumph Speed Triple 1200 RS : ఈ మధ్య కాలంలో ట్రయంఫ్ స్పోర్ట్స్​ బైక్​లకు ఆదరణ పెరుగుతోంది. ధర ఎక్కువైనా ఈ బైక్​ పెర్ఫామెన్స్​కు చాలా మంది ఫ్యాన్స్​ అవుతున్నారు. ట్రయంఫ్​ స్పీడ్​ ట్రిపుల్ 1200 ఆర్​ఎస్​ స్పోర్ట్స్​ బైక్ యువతను విపరీతంగా​ ఆకట్టుకుంటోంది. ఈ బైక్​లో 1160 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్​ ఉంది. ఈ ట్రయంఫ్​ స్పీడ్​ ట్రిపుల్ 1200 ఆర్​ఎస్​​ 17.8 కి.మీ/లీటర్​. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.18,24,976 ఉంటుంది.

5. KTM RC 390 :గత కొన్నేళ్లుగా భారత్​లో కేటీఎమ్​ బైక్​లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మీడియం రేంజ్​ ధరలో స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునే వారికి కేటీఎం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ మోడల్​ కేటీఎమ్​ ఆర్​సీ 390. మంచి క్లాసిక్​ లుక్​లో ఉన్న ఈ బైక్​లో 373.27 cc ఇంజిన్​ను అమర్చారు. 6 స్పీడ్​ మాన్యువల్ ట్రాన్సిషన్​తో వస్తుంది. ఈ బైక్ 29 కి.మీ/ లీటర్​ మైలేజ్ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.3,16,163 ఉంటుంది.

ఫస్ట్​టైం బైక్​ కొంటున్నారా? ఈ టాప్​-10 టిప్స్​ మీ కోసమే!​ - Two Wheeler Buying Tips

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే! - Best Bikes Under 1 Lakh

ABOUT THE AUTHOR

...view details