తెలంగాణ

telangana

ETV Bharat / business

మహిళా ఉద్యోగులకు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్-10 స్కూటీస్ ఇవే! - Best Scooters Or College Students - BEST SCOOTERS OR COLLEGE STUDENTS

Best Scooters Or College Students : మీరు ఉద్యోగం చేస్తున్న మహిళలా? లేదా కాలేజ్​కు వెళ్లే అమ్మాయిలా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో ఒక లక్ష రూపాయల బడ్జెట్లో లభిస్తున్న టాప్​-10 స్కూటీలపై ఓ లుక్కేద్దాం రండి.

Best Scooters under 1 lakh
Best Scooters for college students (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 2:32 PM IST

Best Scooters Or College Students :ప్రస్తుత కాలంలో మహిళలు ఎక్కువగా స్కూటీలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వారికి స్కూటీలు నడపడానికి సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అందుకే కాలేజ్​కు వెళ్లే విద్యార్థినిలు, ఆఫీసులకు వెళ్లే మహిళలు ఎక్కువగా స్కూటీలను వాడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఒక లక్ష రూపాయల బడ్జెట్లో, మంచి మైలేజ్, పెర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్-10 స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.

1. Honda Activa 6G Specifications :హోండా యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్​ కలిగి ఉంటుంది. ఇది 7.79 పీఎస్ పవర్​ను, 8.84 టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా 6జీ స్కూటీ కెర్బ్ వెయిట్ 106 కేజీలు. ఈ స్కూటీ లీటర్ పెట్రోల్​కు 50 కి.మీ మైలేజ్​ను ఇస్తుంది. దీనికి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. హోండా యాక్టివా 6జీకి మార్కెట్లో ప్రధాన పోటీదారులుగా టీవీఎస్ జూపిటర్, టీవీఎస్ స్కూటీ జెస్ట్, హోండా డియోలు ఉన్నాయి. హోండా యాక్టివా 6జీ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.76,234 - రూ.82,734 వరకు ఉంటుంది.

2. Suzuki Access 125 Specifications :భారతదేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో సుజుకి యాక్సిస్ 125 ఒకటి. ఈ స్కూటీ మంచి రైడింగ్​ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. సుజుకి యాక్సిస్ 125 స్కూటర్ 124 సీసీ ఇంజిన్​ కలిగి ఉంటుంది. ఇది 8.7 పీఎస్ పవర్​ను, 10 టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 104 కేజీలు. ఇది లీటర్ పెట్రోల్​కు 45 కి.మీ మైలేజ్​ను ఇస్తుంది. ఈ హోండా సుజుకి యాక్సిస్ 125లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో సుజుకి యాక్సిస్ 125కు ప్రధాన పోటీదారులుగా విడా వీ1, హోండా యాక్టివా 6జీ, టీవీఎస్ ఎన్ టీఓఆర్ క్యూ 125 ఉన్నాయి. సుజుకి యాక్సిస్ 125 మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.79,900 - రూ.90,500 వరకు ఉంటుంది.

3. TVS NTORQ 125 Specifications :టీవీఎస్ ఎన్​టార్క్ క్యూ 125 స్కూటీ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్​కు 47 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.84,636 - రూ.1.05 లక్షల వరకు ఉంటుంది. టీవీఎస్ ఎన్​టార్క్​ క్యూ 125 బైక్​లో 124.8 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 9.51 పీఎస్ పవర్, 10.6 టార్క్​ను విడుదల చేస్తుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 111 కేజీలు. దీనిలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో టీవీఎస్ ఎన్​టార్క్ క్యూ 125 బండికి విడా వీ1, హోండా యాక్టివా 125, ఏప్రిలియా ఎస్ఆర్ 124 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

4. Honda Activa 125 Specifications :హోండా యాక్టివా 125 బైక్​లో 124 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.30 పీఎస్ పవర్, 10.4 ఎన్ఎం టార్క్​ను జనరేట్ చేస్తుంది. దీని ధర రూ.80,256 - రూ. 89,429 వరకు ఉంటుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఇది లీటర్ పెట్రోల్​కు 60కి.మీ మైలేజ్ ఇస్తుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. హోండా యాక్టివా 125కి మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 125, టీవీఎస్ ఎన్​టార్క్​ క్యూ 125, సుజుకి అవెనిస్ స్కూటీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఈ స్కూటీ 4 వేరియంట్లలో లభిస్తుంది.

5. TVS Jupiter Specifications :టీవీఎస్ జూపిటర్ స్కూటీ 4 వేరియంట్లలో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్​కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.80,256 - రూ.89,429 వరకు ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ 124 సీసీ ఇంజిన్​తో వస్తుంది. ఇది 8.30 పీఎస్ పవర్​ను, 10.4 టార్క్​ను విడుదల చేస్తుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఈ స్కూటీకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. టీవీఎస్ జూపిటర్ స్కూటీకి పోటీగా మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 125, టీవీఎస్ ఎన్​టార్క్​ క్యూ 125, సుజుకి అవెనిస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

6. Honda Dio Specifications :హోండా డియో స్కూటీ మహిళలు నడపడానికి కంఫర్ట్​గా ఉంటుంది. దీని ధర రూ.70,211 - రూ. 77,712 వరకు ఉంటుంది. హోండా డియో 109.51 సీసీ ఇంజిన్​తో లభిస్తుంది. ఇది 7.85 పీఎస్ పవర్, 9.03 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కెర్బ్ వెయిట్ 103 కేజీలు. హోండా డియోకి మార్కెట్లో హీరో జూమ్, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. హోండా డియో 3 వేరియంట్లలో లభిస్తుంది.

7. Ola S1 X Specifications :ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మంచి స్కూటర్లలో ఓలా ఎస్1 ఎక్స్ ఒకటి. ఇది 4 వేరియంట్లలో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీని ధర రూ.74,999 - రూ.99,999 వరకు ఉంటుంది. ఓలా ఎస్1 ఎక్స్ కెర్బ్ వెయిట్ 101 కేజీలు. బ్యాటరీ కెపాసిటీ 2 Kwh. ఈ ఈవీ స్కూటీ టాప్ స్పీడ్ గంటకు 85 కి.మీ. కేవలం 5 గంటల్లోనే ఈ స్కూటీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీనికి బజాజ్ చేతక్, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటీలు పోటీగా ఉన్నాయి.

8. Yamaha RayZR 125 Fi Hybrid :మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలకునేవారికి యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కూటీ లీటర్ పెట్రోల్​కు 71.33 కి.మీ మైలేజ్ ఇస్తుంది. యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్​ఐ హైబ్రిడ్ స్కూటర్ 125సీసీ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 8.2 పీఎస్ పవర్, 10.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బండి 5 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.85,300 - రూ.95,730 వరకు ఉంటుంది. దీని కెర్బ్ వెయిట్ 98 కేజీలు. ఈ బండికి మార్కెట్లో హీరో జూమ్ 110, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

9. TVS Jupiter 125 Specifications :టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్​తో లభిస్తుంది. ఇది 8.15 పీఎస్ పవర్, 10.5 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ జూపిటర్ 125 స్కూటీ కెర్బ్ వెయిట్ 108 కేజీలు. ఇది లీటర్ పెట్రోల్​కు 57.27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనికి వీడా వీ1, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 స్కూటీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 125 మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.86,405 - రూ.96,855 వరకు ఉంటుంది.

10. Suzuki Burgman Street Specifications :సుజుకి బర్గ్​మ్యాన్ స్ట్రీట్ స్కూటీ లీటరు పెట్రోల్​తో 48 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 124 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.7 పవర్, 10 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సుజుకి బర్గ్​మ్యాన్ స్ట్రీట్ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఈ స్కూటీ 3 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.94,301 - రూ.1.15 లక్షల వరకు ఉంటుంది. సుజుకి బర్గ్​మ్యాన్ స్ట్రీట్​కు హీరో జూమ్ 110, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

నోట్​ : ఈ స్కూటీలను అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా హాయిగా డ్రైవ్ చేయవచ్చు. సింపుల్​గా చెప్పాలంటే, స్త్రీ, పురుష అనే భేదం లేకుండా ఇంట్లో ఉన్న వారందరూ వీటిని హాయిగా నడపవచ్చు.

'ITR ఫైలింగ్ గడువు పొడిగించలేదు - జులై 31లోగా రిటర్నులు సమర్పించాల్సిందే' - ఐటీ డిపార్ట్​మెంట్​ - ITR Filing Last Date 2024

ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​ కోసం రూ.లక్ష బడ్జెట్​లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India

ABOUT THE AUTHOR

...view details