Best Mileage Scooters :స్కూటర్లు స్త్రీ, పురుషులు ఇద్దరికీ చాలా అనువుగా ఉంటాయి. పైగా రద్దీగా ఉండే రోడ్లపై కూడా స్కూటీతో చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు. ఇరుకైన సందుల్లో కూడా హాయిగా డ్రైవ్ చేయవచ్చు. అందుకే స్కూటర్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరి మీరు కూడా మంచి స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల బడ్జెట్లో లభిస్తున్న మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Yamaha RayZR 125 Fi Hybrid Features :యమహా కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటర్లలో ఈ RayZR 125 ఒకటి. రూ.1 లక్ష బడ్జెట్లోపు మంచి టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ : 125 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.2 PS@6000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.3 Nm@5000 rpm
- మైలేజ్ : 71.33 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
- గేర్స్ : వీ-బెల్ట్ ఆటోమేటిక్
- కెర్బ్ వెయిట్ : 99 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Yamaha RayZR 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ ధర సుమారుగా రూ.87,295 నుంచి రూ.97,264 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Yamaha Fascino 125 Fi Hybrid Features :ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఒక లక్ష రూపాయల లోపు మంచి స్కూటీ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- ఇంజిన్ : 125 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.2 PS@6500 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.3 Nm@5000 rpm
- మైలేజ్ : 68.75 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
- గేర్స్ : వీ-బెల్ట్ ఆటోమేటిక్
- కెర్బ్ వెయిట్ : 99 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Yamaha Fascino 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటీ ధర సుమారుగా రూ.84,088 - రూ.94,561 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Honda Activa 125 Features : ఇండియాలో మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 125 ఒకటి. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.30 PS@6250 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.4Nm@5000 rpm
- మైలేజ్ : 60కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 109 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటర్ ధర సుమారుగా రూ.84,718 నుంచి రూ.93,890 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. TVS NTORQ 125 Features : స్టైలిష్ డిజైన్‌తో, మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని అనుకునేవారికి టీవీఎస్ ఎన్‌టార్క్ 125. ఇది చాలా స్ట్రాంగ్‌గా, డ్రైవింగ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 9.51 PS@7000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.6Nm@5500 rpm
- మైలేజ్ : 53.4 - 56.23 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.8 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 109 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
TVS NTORQ 125 Price :మార్కెట్లో ఈ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.88,333 నుంచి రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
5. Hero Destini Prime Features : రూ.80వేలు లోపు మంచి స్కూటర్ కొనాలని అనుకునేవారికి హీరో డెస్టినీ ప్రైమ్ మంచి ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 9.09 PS@7000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.38Nm@5500 rpm
- మైలేజ్ : 56 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5 లీటర్స్
- గేర్స్ : వేరియామాటిక్ డ్రైవ్
- కెర్బ్ వెయిట్ : 115 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Hero Destini Prime Price : మార్కెట్లో ఈ హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్ ధర సుమారుగా రూ.79,548 (ఎక్స్-షోరూం) ఉంటుంది.