ETV Bharat / business

అర్జెంట్​గా లోన్ కావాలా? PAN కార్డ్​ ఉంటే చాలు - ఇలా చేస్తే ఈజీగా రుణం మంజూరు! - PAN CARD LOANS

పాన్ కార్డుతో రూ.5వేల రుణం- ఇలా చేస్తే ఈజీగా మంజూరు!

PAN Card Loans
PAN Card Loans (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 1:21 PM IST

PAN Card Loans : ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు వ్యక్తిగత రుణాలను తీసుకోవడం తప్పేం కాదు. వాటివల్ల అత్యవసరంగా డబ్బులు చేతికి అందడమే కాదు తిరిగి చెల్లించేందుకు సులభమైన మార్గాలు అందుబాటులో ఉంటాయి. కేవలం పాన్ కార్డుతోనూ రూ.5వేల దాకా రుణాన్ని పొందొచ్చు. ఈ లోన్‌ను పొందే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అదేలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఈ రుణం ఎవరు ఇస్తారు ?
ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లాగే పాన్ కార్డు సైతం ముఖ్యమైన డాక్యుమెంట్. చాలా రుణాలను పొందే క్రమంలో పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేస్తారు. క్రెడిట్ స్కోరు బాగుండి, చేతిలో పాన్ కార్డు ఉంటే చాలు రూ.5వేల దాకా రుణం లభిస్తుంది. పలు బ్యాంకులు, డిజిటల్ రుణ వేదికలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ చిన్నతరహా రుణాన్ని అందిస్తున్నాయి.

తెలుసుకోవాల్సిన విషయాలు
వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉండే సంస్థ నుంచే రుణం తీసుకోండి. వీటన్నింటితో పాటు రుణం తిరిగి చెల్లింపునకు సాధ్యమైనంత ఎక్కువ గడువును ఇచ్చే సంస్థనే ఎంచుకోండి. ఈ రుణానికి దరఖాస్తు చేసే క్రమంలో పాన్ కార్డుతో పాటు ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు తప్పకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ వివరాలతో కూడిన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఇవ్వాలనే షరతు పెడుతుంటాయి. అదనంగా పూచీకత్తు(ష్యూరిటీ)ను కూడా అందిస్తే రుణ మొత్తాన్ని పెంచేందుకు సదరు బ్యాంకులు అంగీకరించే అవకాశం ఉంటుంది.

సకాలంలో తిరిగి చెల్లించకుంటే
పాన్‌కార్డుతో తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించకుంటే ఆలస్య చెల్లింపు ఛార్జీలను విధిస్తారు. అందుకే ఒకవేళ ఈ రుణం తీసుకుంటే సకాలంలో తిరిగి చెల్లించండి. మీ ఆర్థిక అత్యవసరాలను తీర్చుకునేందుకు ఈ తరహా చిన్న రుణాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది. చాలా తక్కువ శ్రమతో క్రెడిట్ స్కోరును గణనీయంగా పెంచుకునేందుకు ఇది చక్కటి మార్గం.

పూచీకత్తు లేకుండా రూ.20కోట్ల వరకు బిజినెస్ లోన్​ - ఈ​ స్కీమ్​ గురించి మీకు తెలుసా?

గోల్డ్​ లోన్​ తీసుకోవాలా? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే- ఏ బ్యాంక్​లో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.