Personal Loan with Credit Score 600 : వ్యక్తిగత రుణాలు కావాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. కొంత మందికి 600 వరకు క్రెడిట్ స్కోరు ఉంటుంది. ఇలాంటి వారికి లోన్ రావడం చాలా కష్టమే. అయితే ఇప్పుడు కొన్ని డిజిటల్ లోన్ యాప్స్ మాత్రం 600 క్రెడిట్ స్కోరు ఉన్నవాళ్లకూ రుణాలు ఇచ్చేస్తున్నాయి. గత కొన్ని నెలల క్రెడిట్ హిస్టరీని పరిశీలించి, సులభంగా దరఖాస్తును ప్రాసెస్ చేస్తున్నాయి. అయితే ఆర్థిక అత్యవసరాలు ఉంటేనే ఈ యాప్స్ నుంచి రుణం తీసుకోవాలి. ఎందుకంటే వీటి వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య చెల్లింపు రుసుములు ఎక్కువ.
750 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్
క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 దాకా ఉంటుంది. 900 దాకా స్కోర్ ఉంటే తప్పకుండా లోన్ వస్తుంది. 750 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోరు కలిగిన వారిని ఎక్సలెంట్ కేటగిరీలో చేరుస్తారు. వీరికి రుణాలు మంజూరయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ముందుకు వస్తాయి.
650 నుంచి 749 వరకు క్రెడిట్ స్కోర్
650 నుంచి 749 వరకు క్రెడిట్ స్కోరు కలిగిన వారిని గుడ్ కేటగిరీలో చేరుస్తారు. వీరికి రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే రుణాలపై వడ్డీరేటు కొంచెం ఎక్కువే ఉంటుంది.
600 నుంచి 649 వరకు క్రెడిట్ స్కోరు
600 నుంచి 649 వరకు క్రెడిట్ స్కోరును కలిగిన వారిని ఫెయిర్ కేటగిరీలోకి చేరుస్తారు. అయితే ఇందులోని వారికి రుణాలు మంజూరవుతాయనే గ్యారంటీ ఏదీ లేదు. ఒకవేళ వీరికి రుణం మంజూరైనా, వడ్డీరేటు చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు తమకు రిస్క్ ఉంటుందనే భావనతో ఎక్కువ వడ్డీకి మాత్రమే రుణం ఇస్తాయి.
300 నుంచి 599 వరకు క్రెడిట్ స్కోరు
600 లేదా అంతకంటే తక్కువ స్కోర్ ఉన్నవారికి పెద్దగా ప్రాధాన్యమివ్వవు. 300 నుంచి 599 వరకు స్కోర్ ఉన్న వారిని పూర్ కేటగిరీలో ఉన్నవారిగా పరిగణిస్తారు. వీరంతా రుణాలు డీఫాల్డ్ అయ్యే స్వభావం కలిగినవారు. పూర్ కేటగిరీ వారికి రుణాలు దాదాపుగా రావు.
క్రెడిట్ స్కోరును పెంచుకోవడం ఇలా!
క్రెడిట్ స్కోరును పెంచుకోవడం ఈజీయే. ఇందుకోసం సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలి. క్రెడిట్ కార్డు వంటివి ఉంటే విచ్చలవిడిగా వాడకూడదు. క్రెడిట్ రిపోర్టులో ఏవైనా తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు సరి చేయించుకోవాలి. ఒకటికి మించి అప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఆదాయానికి మించి అప్పులు చేయకూడదు. రుణాల కోసం మితిమీరిన దరఖాస్తులు చేయకూడదు.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
ఒక క్రెడిట్ కార్డ్‌తో మరో క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా? ఈ 3 మెథడ్స్ ఫాలో అవ్వండి!
మీ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు త్వరలో ఎక్స్‌పైర్ అవున్నాయా? - ఇలా వాడితే ఫుల్ బెనిఫిట్స్!