iPhone SE 4 First Look: యాపిల్ త్వరలో తన సరికొత్త ఐఫోన్‌ను లాంఛ్ చేయనుంది. 'ఐఫోన్ SE 4' లేదా 'ఐఫోన్ 16E' పేరుతో దీన్ని ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో తీసుకురానుంది. సాధారణంగా యాపిల్ ఈ లైనప్‌ను SE పేరుతో రిలీజ్ చేసేది. కానీ ఈసారి ఈ చౌకైన ఐఫోన్ మోడల్‌ను 'ఐఫోన్ SE 4'గా కాకుండా 'ఐఫోన్ 16E'గా లాంఛ్ చేయొచ్చని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇక ఐఫోన్ ఫస్ట్ గ్లింప్స్‌లో యాపిల్ ఈ అప్‌కమింగ్ ఫోన్ డమ్మీ బయటపడింది.
ఐఫోన్ SE 4 డమ్మీ లీక్: ఈ డమ్మీలో 'ఐఫోన్ SE 4' మోడల్‌ను రెండు కలర్స్‌లో చూడొచ్చు. అవి వైట్, బ్లాక్. అంటే దీన్ని బట్టి యాపిల్ ఈ ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లలో లాంఛ్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల గురించి సమాచారం అందించే పాపులర్ టిప్‌స్టర్ సోనీ డిక్సన్ తన X అకౌంట్ లో దీనిపై ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఈ అప్‌కమింగ్ యాపిల్ ఐఫోన్‌కు చెందిన రెండు ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలో అప్‌కమింగ్ ఐఫోన్ తెలుపు, నలుపు రంగులో లాంఛ్ అవుతుందని తెలియజేస్తుంది.
ఈ ఫొటోలో ఫోన్ బ్యాక్, సైడ్ యాంగిల్ కన్పిస్తుంది. మొదటి చూపులో ఈ ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా అనేక మీడియా కథనాల్లో కూడా ఇదే చర్చించారు.
ఊహించినట్లుగానే ఈ ఫోన్ వెనక భాగంలో టాప్ లెఫ్ట్ కార్నర్లో సింగిల్ కెమెరా కన్పిస్తుంది. బ్యాక్ కెమెరా పక్కనే పెద్ద LED ఫ్లాష్ లైట్ ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా మంచి ఫొటోలను తీసేందుకు సహాయపడుతుంది. ఈ ఫోన్ వెనక డిజైన్ పూర్తిగా ఫ్లాట్ సైడ్స్‌తో వస్తుంది.
First look at the iPhone SE 4 Dummy pic.twitter.com/qL0COgmPPA
— Sonny Dickson (@SonnyDickson) January 16, 2025
ఫోన్ ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్, మ్యూట్ స్విచ్ ఉన్నాయి. దిగువన సిమ్ ట్రే కూడా ఉంది. దీనిలో ఉన్న మ్యూట్ బటన్‌ను యాక్షన్ బటన్ అని కొన్ని మునుపటి నివేదికలలో చెప్పుకొచ్చారు. అయితే ఇది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.
ఐఫోన్ SE 4 స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్: యాపిల్ ఈ ఐఫోన్‌ను ఏప్రిల్ 2025లో లాంఛ్ చేయొచ్చు. టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ 6.06-అంగుళాల ఫుల్ HD ప్లస్ LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 60Hz ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫేస్‌ఐడి ఫీచర్ ఉండొచ్చు. ఫోన్‌లో ప్రాసెసర్ కోసం యాపిల్‌కు చెందిన A18 బయోనిక్ చిప్‌ను ఉపయోగించొచ్చు. ఇదిగానీ జరిగితే వినియోగదారులు ఈ చౌకైన ఐఫోన్‌లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ల సపోర్ట్‌ను పొందొచ్చు.
ఐఫోన్ SE 4 మోడల్‌ను 6GB అండ్ 8GB RAM ఆప్షన్లలో లాంఛ్ చేయొచ్చు. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్, USB టైప్-C పోర్ట్ కలిగి ఉంటుంది. ఫోన్ వెనక భాగంలో ఉన్న ఏకైక కెమెరా 48MP సెన్సార్‌తో రావొచ్చు.
ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్ ధర USలో $500 (సుమారు రూ. 42,000). దక్షిణ కొరియాలో KRW 8,00,000 (సుమారు రూ. 46,000) కంటే ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రకారం ఈ ఐఫోన్‌ను భారతదేశంలో కూడా రూ. 50,000 కంటే తక్కువ ధరకే రిలీజ్ చేయొచ్చు.
వామ్మో.. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధరలు చూశారా?- జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయ్‌గా!
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై మీ స్టేటస్ మరింత ఎట్రాక్టివ్‌గా!
యాపిల్ సంచలన నిర్ణయం- ఏఐ జనరేటెడ్ ఎర్రర్-ప్రోన్ ఫీచర్ తొలగింపు!