ETV Bharat / business

ఆ బ్రౌజర్ యూజ్ చేస్తే ఫ్రీగా జియో కాయిన్స్- మొబైల్ రీఛార్జ్, షాపింగ్ చేయొచ్చు- డబ్బులూ తీసుకోవచ్చు! - JIO COIN FEATURES

జియో కాయిన్‌తో ముకేశ్ అంబానీ మరో సంచలనం- జియో స్పియర్ బ్రౌజర్‌ను వినియోగించే వారికి డిజిటల్ టోకెన్లు- మొబైల్ రీఛార్జ్, షాపింగ్ ఫ్రీ!

Jio Coin Features
Jio Coin Features (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 4:12 PM IST

Jio Coin Features : రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఈతరం డిజిటల్ యుగానికి అనుగుణంగా సరికొత్త వ్యాపారాలను ముకేశ్ అంబానీ మొదలుపెడుతున్నారు. ఇటీవల జియో కాయిన్‌ పేరుతో కొత్త బిజినెస్‌కు జియో కంపెనీ శ్రీకారం చుట్టింది. అయితే జియో కాయిన్​ను ప్రస్తావిస్తూ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఇంతకీ ఏమిటీ జియో కాయిన్? దీని ఫీచర్స్ ఏమిటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్ క్రోమ్, బ్రేవ్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌‌లతో ఢీ!
జియో కాయిన్స్ అనేవి డిజిటల్ టోకెన్లు. పాలిగాన్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీతో ‘జియో ప్లాట్‌ఫామ్స్’ కలిసి జియో కాయిన్ల జారీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా గూగుల్ క్రోమ్, బ్రేవ్ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ వంటి ప్రఖ్యాత బ్రౌజర్లతో పోటీ పడాలని జియో భావిస్తోంది. జియో స్పియర్ అనే బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించే వారికి రివార్డు పాయింట్లుగా జియో కాయిన్లను జారీ చేయనుందని సమాచారం. జియో స్పియర్ బ్రౌజర్‌ను మనం ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్‌లలో పొందొచ్చు. అందులో అకౌంటు క్రియేట్ చేసుకొని, లాగిన్ కావాలి. ఈ బ్రౌజర్‌ను వినియోగించిన చాలా మందికి ఇప్పటికే జియో కాయిన్లు రివార్డుగా అందాయని తెలిసింది.

జియో కాయిన్లు వినియోగించుకోవడం ఎలా?
జియో ప్లాట్‌ఫామ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పాలీగన్ కంపెనీకి చెందిన వ్యాలెట్లలో జియో కాయిన్లు సేవ్ అవుతాయి. అయితే వీటిని రీడీమ్ చేయలేం, ఇతరులకు బదిలీ చేయలేం. అదే నిజమైతే వాటిని రివార్డులుగా తీసుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? జియో కాయిన్ రివార్డులతో మొబైల్ రీఛార్జులు, జియో ఉత్పత్తుల కొనుగోళ్లు, రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో చెల్లింపులు చేయొచ్చని అంటున్నారు. రానున్న రోజుల్లో జియో కాయిన్ రివార్డు టోకెన్లను కరెన్సీగా మార్చుకునే అవకాశం కూడా ఇస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. యూపీఐ‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా ద్వారా జియో కాయిన్లను రీడీమ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో జియో కాయిన్ ద్వారా మరిన్ని బ్లాక్ చైన్, వెబ్3 ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.

ఆకాశ్ అంబానీ సారథ్యం
జియో కాయిన్ విభాగం కోసం దాదాపు 50 మంది సిబ్బందిని జియో ప్లాట్‌ఫామ్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును స్వయంగా ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ లీడ్ చేస్తున్నారు. వాస్తవానికి భవిష్యత్తులో మన దేశంలో క్రిప్టో కరెన్సీ నియమాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతానికైతే క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై భారత్‌లో 30 శాతం పన్నును విధిస్తున్నారు. మూలం వద్ద పన్ను (టీడీఎస్) 1 శాతం కట్టాల్సి వస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.