Best Bikes Under 70000 :మంచి బైక్ కొనుక్కోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. అయితే బడ్జెట్ సమస్య వాళ్లను ఇబ్బందిపెడుతుంది. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ ధరలో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న బైక్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.70,000 బడ్జెట్లో ఉన్న టాప్-5 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5. Bajaj Platina 100 Features :ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న సరసమైన (ఎఫర్డబుల్) బైక్‌లలో బజాజ్ ప్లాటినా 100 ఒకటి. ఈ టూ-వీలర్లో 102 సీసీ సామర్థ్యం ఉన్న మోటార్‌ను అమర్చారు. ఇది డీటీఎస్-ఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఈ మోటార్ ఫ్యూయెల్ ఇంజెక్షన్‌తో కాకుండా ఈ-కర్బ్తో పనిచేస్తుంది. ఈ మోటార్ 7.9 హెచ్‌పీ పవర్, 8.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
Bajaj Platina 100 Price : మార్కెట్లో ఈ బజాజ్ ప్లాటినా 100 బైక్ ధర సుమారుగా రూ.67,808 ఉంటుంది.
4. Honda Shine 100 Features : భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభిస్తున్న బైక్‌ల్లో హోండా షైన్ 100 ఒకటి. ఈ బైక్ ఆటో చోక్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్లను కలిగి ఉంది. ఓబీడీ-2ఏ కంప్లైంట్, ఈ20 కంపాటిబిలిటీ ఉన్న ఏకైక ఎఫర్డబుల్ బైక్ ఇదే.
ఈ హోండా షైన్ 100 బైక్‌లో 99.7 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7.61 హెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దేశంలోని అత్యంత సరమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్ బైక్ ఇది.
Honda Shine 100 Price :మార్కెట్లో ఈ హోండా షైన్ 100 బైక్ ధర సుమారుగా రూ.64,900 ఉంటుంది.
3. TVS Sport Features :అత్యంత తక్కువ ధరలో మంచి బైక్ కొనాలని అనుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్‌లో 109.7 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 8.3 హెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో కిక్ స్టార్టర్, సెల్ఫ్-స్టార్టర్ వేరియంట్లు ఉన్నాయి.