తెలంగాణ

telangana

ETV Bharat / business

అంబానీ సంగీత్​లో పాప్​ సింగర్ జస్టిన్​ బీబర్- రూ.83 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రదర్శన! - Anant Ambani Radhika Wedding - ANANT AMBANI RADHIKA WEDDING

Anant Ambani Radhika Wedding Justin Bieber : అనంత్- రాధిక సంగీత్​లో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నారు. అందుకు ఆయన అంబానీ ఫ్యామిలీ రూ.83 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంగీత్​లో పాల్గొనేందుకు జస్టిన్ బీబర్ శుక్రవారం ముంబయికి చేరుకున్నారు.

Anant Ambani Radhika Wedding
Anant Ambani Radhika Wedding (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 12:44 PM IST

Anant Ambani Radhika Wedding Justin Bieber: దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న (శుక్రవారం) అనంత్-రాధిక జంట సంగీత్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముంబయికి శుక్రవారం చేరుకున్నారు. సంగీత్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు బీబర్‌ను రప్పించిన అంబానీ ఫ్యామిలీ, ఆయనకు రూ.83 కోట్ల మేర డబ్బు ఆఫర్‌ చేసిందని తెలుస్తోంది. సంగీత్ కార్యక్రమంలో బీబర్ తన గాత్రంతో అతిథులందరినీ ఆకట్టుకోనున్నారు. అడెల్‌, డ్రేక్‌, లానా డెల్‌ రే వంటి సింగర్స్‌ సైతం సంగీత్​లో పాటలు పాడనున్నట్లు తెలుస్తోంది.

చిన్న వయసులోనే 'ఓ బేబీ బేబీ' అంటూ అందర్నీ ఆకట్టుకున్న పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌. కెనడాకు చెందిన ఆయన సారీ, లవ్‌ యువర్‌ సెల్ఫ్‌ వంటి పాటలతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2017లో భారత్​లో సంగీత కచేరీకి వచ్చిన జస్టిన్ బీబర్ మళ్లీ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. 2022లో మరోసారి భారత్​కు రావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో రాలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా జస్టిన్ బీబర్ గాత్రానికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాగే ప్రపంచంలో పాపులర్ సింగర్. అందుకే అంబానీ కుటుంబం అనంత్- రాధిక సంగీత్​లో ఆయనతో పాటలు పాడించనున్నట్లు తెలుస్తోంది. భారీగా ఖర్చు చేసి మరి బీబర్​ను భారత్​కు రప్పించినట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా కార్యక్రమాలు
గత కొద్ది రోజులుగా అంబానీ ఇంట పెళ్లి ముందస్తు వేడుకలు జరుగుతున్నాయి. జులై 2న పేద యువతీయువకులకు సామూహిక వివాహాలు జరిపించింది అంబానీ ఫ్యామిలీ. జులై 3న మామెరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

అనంత్-రాధిక పెళ్లి షెడ్యూల్
జులై 12 నుంచి మూడు రోజుల పాటు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగనున్నాయి. జులై 12న శుభ్‌ వివాహ్‌తో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. జులై 13న శుభ్‌ ఆశీర్వాద్‌ కార్యక్రమం జరగనుంది. జులై 14న మంగళ్‌ ఉత్సవ్​తో వివాహ వేడుకలు ముగుస్తాయి.

అంబానీ ఇంట గ్రాండ్​గా 'మామెరు' వేడుక- బంగారు దీపాలతో అలంకరణ- పెళ్లి ఫుల్​ షెడ్యూల్ ఇదే! - Anant Ambani Radhika Wedding

రూ.1.01 లక్షల స్త్రీధనం, ఏడాదికి సరిపడా సరకులు- గ్రాండ్​గా సామూహిక వివాహాలు చేసిన అంబానీ ఫ్యామిలీ - Ambani Mass Wedding

ABOUT THE AUTHOR

...view details