ETV Bharat / health

'పిల్లల్లోనే HMPV ప్రభావం ఎక్కువ'- ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సలహా! - HMPV VIRUS CHILDREN

-HMPV- కరోనా వైరస్​కు మధ్య పోలికలు! -పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

HMPV Virus Children
HMPV Virus Children (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 7, 2025, 11:42 AM IST

HMPV Virus Children: HMPV.. ప్రస్తుతం చైనాలో వచ్చిన కొత్త వైరస్ గురించే చర్చ నడుస్తోంది. హ్యూమన్‌ మెటాన్యుమోవైరస్‌ గురించి పెద్దగా ఆందోళన, భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చో ప్రముఖ పిడియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కల్యాణి వివరిస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.

"ఈ వైరస్‌ తొలి వారంలో ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా, వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, పిల్లికూతల వంటి లక్షణాలు ఉంటే వారిని.. శిశువులకు, చిన్న పిల్లలకు దూరంగా (కనీసం ఆరు అడుగులు) ఉంచాలి. మీరైనా, పిల్లలనైనా వేరే గదిలో విడిగా ఉంచితే ఇంకా మంచిది. ఇంకా చేతులను శుభ్రంగా కడుక్కోకుండా శిశువులను ముట్టుకోకూడదు. రోజుకు అరగంట సేపు (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో) పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. ఫలితంగా విటమిన్‌ డి ఉత్పత్తై రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలూ, పోషకాహారం ఇవ్వాలి. శిశువులకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి. పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా, జ్వరం తీవ్రంగా ఉన్నా, పాలు తాగకపోతున్నా, డొక్కలెగరేస్తున్నా, ఆయాస పడుతున్నా, మరీ ఎక్కువగా దగ్గుతున్నా, స్తబ్ధుగా ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సొంత వైద్యం చేసుకోకూడదు. ముఖ్యంగా స్టిరాయిడ్లు, యాంటీబయాటిక్‌ మందులు గానీ వాడకూడదు. ఈ మధ్య కాలంలో చాలామంది డాక్టర్లు ఫోన్‌లో ఆడియో లేదా వీడియో కాల్స్‌తోనూ వైద్య సేవలను అందిస్తున్నారు. ఒకవేళ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించాలి. ఫలితంగా చల్లగాలికి పిల్లలను తిప్పకుండా ఇంట్లోనే ఉండి, వైద్య సలహాలు పొందొచ్చు."

--డాక్టర్ శ్రీనివాస్ కల్యాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్

కొవిడ్‌-19తో పోలిక!
అయితే, హెచ్‌ఎంపీవీ కొన్ని విషయాల్లో కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2తో పోలి ఉంటుందని డాక్టర్ శ్రీనివాస్ కల్యాణి చెబుతున్నారు. ఇవి రెండూ అన్ని వయసుల వారిలోనూ శ్వాసకోశ జబ్బులకు దారితీసేవేనని వివరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తగ్గినవారికి ఎక్కువ ముప్పు పొంచి ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇంకా రెండింటి లక్షణాలూ దాదాపు ఒకేలా ఉంటున్నాయని అంటున్నారు. కొవిడ్‌లో మాదిరిగానే జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివీ ఇందులోనూ కనిపిస్తున్నాయని తెలిపారు. ఇవి రెండూ దగ్గు, తుమ్ములు, సన్నిహితంగా ఉండటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఇంకా వైరస్‌ వ్యాపించిన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను అంటుకున్నా సోకుతుందని చెబుతున్నారు.

భయమొద్దు గానీ
హెచ్‌ఎంపీవీ వైరస్‌లో ఎ1, ఎ2, బీ1, బీ2 రకాలు ఉన్నాయని డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు. మామూలుగానైతే ఇవేమీ పెద్ద ప్రమాదకరం కావని అంటున్నారు. కానీ, జన్యుపరంగా మార్పులు చెంది ఉద్ధృతంగా మారిందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డారు. చైనాలో ఇదేమీ ప్రమాదకరంగా మారలేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బందేమీ లేదనే చెప్పుకోవచ్చని వివరిస్తున్నారు.

ప్రస్తుతానికి టీకా లేదు
హెచ్‌ఎంపీవీకి ప్రస్తుతానికి టీకా ఏదీ అందుబాటులో లేదని ఆయన వెల్లడిస్తున్నారు. యాంటీ వైరల్‌ చికిత్సనూ దీనికి సిఫారసు చేయటం లేదని.. కానీ కొన్ని జాగ్రత్తలతో దీన్ని వ్యాపించకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు.

  • వైరస్‌ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయకూడదు
  • శుభ్రంలేని చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకకూడదు
  • తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి
  • ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి
  • జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి
  • దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్‌ చేసుకోవాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కరోనాలా HMPV ప్రమాదకరంగా మారుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

మధ్యాహ్నం పని చేస్తుంటే నిద్ర వస్తుందా? ఆఫీస్ టైమ్​లో పడుకోవద్దంటే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.