ETV Bharat / sports

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఫెయిల్యూర్స్- రోహిత్, విరాట్​ బాటలో ఆ ముగ్గురు కూడా! - BORDER GAVASKAR TROPHY 2025

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ విఫలం- వీళ్లే కాదు ఆ ముగ్గురూ కూడా!

Border Gavaskar Trophy 2025
Border Gavaskar Trophy 2025 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 19 hours ago

Border Gavaskar Trophy 2025 : ఇటీవలే ఆసీస్​తో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో టీమ్​ఇండియాకు చుక్కెదురైంది. పదేళ్ల తర్వాత ఆసీస్ 3-1 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల నుంచి కొందరు ప్లేయర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బోర్డర్​- గావస్కర్ ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలకడలేని ఆటతీరుతో విఫలమయ్యారు. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో వీరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే వీరిలాగే మరో ముగ్గురు ప్లేయర్లూ ఈ ట్రోఫీలో ఫామ్​ లేమితో ఇబ్బందిపడ్డారు. వారెవరో చూద్దామా?

ఉస్మాన్ ఖవాజా
ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమయ్యాడు. సిడ్నీ టెస్టు మినహా మిగతా ఏ మ్యాచ్ లోనూ రాణించలేకపోయాడు. 10 ఇన్నింగ్స్ ల్లో కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు.

Associated Press
ఉస్మాన్ ఖవాజా (Associated Press)

మిచెల్ మార్ష్
అలాగే ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమయ్యాడు. దీంతో ఐదో టెస్టుకు అతడి స్థానంలో వెబ్ స్టర్ కు చోటు దక్కింది.

Associated Press
మిచెల్ మార్ష్​ (Associated Press)

శుభ్​మన్ గిల్
టీమ్​ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఆసీస్​తో జరిగిన సిరీస్​లో ఫెయిల్ అయ్యాడు. ఫామ్ లేమితో సతమతమయ్యాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్ ల్లో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.

Associated Press
శుభ్​మన్​ గిల్ (Associated Press)

విరాట్ కోహ్లీ
టీమ్​ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆశించినమేర రాణించలేకపోయాడు. 9 ఇన్నింగ్స్ లో 190 పరుగులే చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది.

Associated Press
విరాట్ కోహ్లీ (Associated Press)

రోహిత్ శర్మ
టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. పెర్త్​లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత అడిలైడ్​లో జరిగిన రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్‌ ల్లో 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్​పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆఖరికి ఫామ్ లేమితో సిడ్నీ టెస్టుకు రోహిత్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించాడు.

Associated Press
రోహిత్ శర్మ (Associated Press)

'రోహిత్​, విరాట్​ల ఫ్యూచర్ ఇక సెలెక్టర్ల చేతిలోనే! - వాళ్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు'

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్​లో సంజూ లేనట్లేనా? అన్యాయమంటూ ఫ్యాన్స్ ఫైర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.