ETV Bharat / offbeat

విమాన ప్రయాణంలో షార్ట్స్‌ ధరిస్తున్నారా? - ఈ ఆరోగ్య సమస్యలకు వెల్​కమ్ చెప్పినట్లేనట! - WHAT TO WEAR ON A PLANE

ఫ్లైట్‌ జర్నీ డ్రసింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలట - లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్!

Dressing Tips for Flight Passengers
WHAT TO WEAR ON A PLANE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 11:55 AM IST

Dressing Tips for Flight Passengers : సాధారణంగా జర్నీ చేసేటప్పుడు ధరించే దుస్తుల విషయంలో చాలా మంది ఫ్యాషన్, కంఫర్ట్ ఈ రెండింటికీ ఎక్కువ ప్రియార్టీ ఇస్తుంటారు. అందులోనూ విమాన ప్రయాణమంటే ఇంకాస్త ట్రెండీగా కనిపించేలా దుస్తుల్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది షార్ట్స్ ధరించి జర్నీ చేస్తుంటారు. కానీ, వీలైనంత వరకు విమానాలలో ప్రయాణించేటప్పుడు అలాంటి దుస్తులు ధరించకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాదు, అలాంటివి ధరించడం వివిధ రకాల అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మరి, అందుకు గల కారణాలేంటి? విమాన ప్రయాణంలో డ్రస్సింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

షార్ట్స్‌ ధరించకపోవడమే బెటర్!

చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కంఫర్ట్​గా ఉంటాయని షార్ట్స్‌, మినీ బాడీకాన్స్‌ వంటివి ధరిస్తుంటారు. అయితే, విమాన ప్రయాణంలో అవి సౌకర్యవంతంగా ఉండడం అటుంచితే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలాంటి పొట్టి దుస్తులు ధరించడం వల్ల చాలావరకు చర్మం బయటికి ఎక్స్‌పోజ్‌ అవుతుంది. వాస్తవానికి విమానాల్లో కొన్ని వందల మంది ప్రయాణించడం వల్ల అందులో ఉండే సీట్లు, వాటికి అనుసంధానమైన హ్యాండ్‌రెస్ట్‌, ఫుట్‌రెస్ట్‌ వంటివి వివిధ క్రిములకు ఆలవాలంగా మారుతాయి.

అప్పుడు మీరు తిరిగి అదే సీట్లో కూర్చోవడం, అవే ఉపరితలాలపై మీ కాళ్లు, చేతులు తగలడం వల్ల అక్కడి బ్యాక్టీరియా, క్రిములు స్కిన్​ పైకి చేరతాయి. ఇవి చేతులు, ముక్కు, నోటి ద్వారా బాడీలోకి ప్రవేశించి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, షార్ట్స్‌ వంటి పొట్టి దుస్తులు వేసుకోవడం వల్ల తొడలకు అంటుకున్న బ్యాక్టీరియా వెజైనా దగ్గరికి చేరే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ఫలితంగా వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు, ప్రత్యుత్పత్తికి సంబంధించిన సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి, విమాన ప్రయాణంలో అటు సౌకర్యానికి, స్టైల్‌కి ప్రాధాన్యమిస్తూనే ఇటు ఆరోగ్యానికీ నష్టం వాటిల్లకుండా దుస్తులు ధరించడం మంచిదంటున్నారు.

డ్రస్సింగ్‌ విషయంలో జాగ్రత్తలు!

  • ఫ్లైట్‌ జర్నీలో వీలైనంత వరకు శరీరాన్ని చాలా వరకు కప్పి ఉంచేలా పొడవాటి, వదులైన దుస్తులు వేసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. లేదంటే సాగే గుణం ఉండే స్ట్రెచబుల్ అవుట్​ఫిట్స్ కూడా మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు! ఇవి ఇటు స్టైల్‌తో పాటు అటు సౌకర్యాన్నీ ఇస్తాయంటున్నారు.
  • బిగుతైన లో దుస్తులు ధరించడం వల్ల కూడా చర్మానికి చెమట పట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి విమాన ప్రయాణాల్లో వదులుగా ఉండే కాటన్‌ లోదుస్తుల్ని ధరించడం మేలట. అలాగే జీన్స్‌, టీషర్ట్స్‌ వంటి బాడీ హగ్గింగ్‌ దుస్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు.
  • అలాగే, విమానంలో ఆయా ఉపరితలాల్ని తాకిన ప్రతిసారీ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవాలి. బాత్‌రూమ్‌లోనూ ఫ్లష్‌ చేత్తో నేరుగా నొక్కకుండా, టిష్యూ సహాయంతో ఫ్లష్‌ చేయడం వల్ల క్రిములు అంటుకోకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు.
  • అదేవిధంగా, సీజన్​ని బట్టి దుస్తుల ఎంపిక చాలా ముఖ్యమంటున్నారు. వీలైనంత వరకు ఆయా సీజన్లకు అనుగుణంగా దుస్తుల్ని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

ఎయిర్‌ హోస్టెస్‌ హైహీల్సే ఎందుకు వేసుకుంటారో తెలుసా? - కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా!

మీరు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.