ETV Bharat / entertainment

మా సినిమా చూడాలని ప్రియాంకను రిక్వెస్ట్ చేశా - 'ఎమర్జెన్సీ' విషయంలో మేము ఆ జాగ్రత్తలు తీసుకున్నాం : కంగనా - KANGANA RANAUT EMERGENCY MOVIE

'ఎమర్జెన్సీ' చూడమని ప్రియాంకను అడిగాను' - కంగనా రనౌత్​

Kangana Ranaut Emergency Movie
Kangana Ranaut Emergency Movie (ANI, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 1:52 PM IST

Kangana Emergency Movie : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. గతంలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సినిమాను చూడమని ఇందిరాగాంధీ మనవరాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి చెప్పినట్లు కంగనా తాజాగా తెలిపారు. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్​లో పాల్గొంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు.

"పార్లమెంట్‌లో ప్రియాంకను ఇటీవలె కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ సినిమాను తప్పకుండా చూడమని కోరాను. దానికి ఆమె ట్రై చేస్తానని రిప్లై ఇచ్చారు. ఆమెతో ఈ సినిమా తనకు తప్పకుండా నచ్చుతుందని అన్నాను. ఇది ఓ సెన్సిటివ్ మ్యాటర్. ఇందిరాగాంధీ పాత్రను మేము ఎంతో మర్యాదపూర్వకంగా చూపించాము. రీసెర్చ్‌ చేస్తున్నప్పుడు నేను ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను. ఇందిరా గాంధీకి తన భర్త, పిల్లలు, సన్నిహితులతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్నాను. శత్రువులతో ఆమె ఏ విధంగా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాను. అటువంటి విషయాలను ఎక్కడా టచ్‌ చేయకుండా ఉండేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా" అని కంగన తెలిపారు.

'సెన్సార్‌ డెసిషన్​తో నాకు ప్రాబ్లమ్ లేదు'
"ఎమర్జెన్సీ సమయంలో నెలకొన్న పరిస్థితులను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని రూపొందించాను. అయితే సినిమా ఫుల్‌వెర్షన్‌ నాకు బాగా నచ్చింది. దాన్నే నేను ఆడియెన్స్​కు చూపించాలనుకున్నా. కానీ తాజా పరిణామాల కారణంగా సినిమపై సెన్సార్‌ కట్స్‌ పడ్డాయి. దానివల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే, మేము ఎవరినో కామెంట్ చేయడానికి ఈ సినిమా చేయలేదు. ఇది అటువంటి సినిమా కూడా కాదు. చరిత్రకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌ను వాళ్లు కట్ చేశారు. వాస్తవానికి అది నా సినిమాపై ఎటువంటి ఎఫెక్ట్​ను చూపించదు. కథ, ఇందులోని మెసేజ్​ ఎక్కడా కూడా చెక్కుచెదరలేదు" అని కంగనా తెలిపారు.

ఎట్టకేలకు 'ఎమర్జెన్సీ' ట్రైలర్ విడుదల - త్వరలోనే రిలీజ్​!

ఎట్టకేలకు కంగన 'ఎమర్జెన్సీ' విడుదల ఖరారు - కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.