ACB Raids On Green Co Company In Madhapur : ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో గతంలో స్పాన్సర్‌గా ఉన్న గ్రీన్‌కో అనుబంధ సంస్థల్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే మాదాపూర్‌లోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలకు దిగింది. దీంతో పాటు విజయవాడ, మచిలీపట్నంలోనూ తనిఖీలు చేపట్టింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒప్పంద పత్రాలు, లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు : తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేసు నుంచి గ్రీన్‌కో తప్పుకుంది. అయితే ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ స్పాన్సర్‌షిప్ నుంచి అర్ధాంతరంగా గ్రీన్‌కో అనుబంధ సంస్థలు వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించాలి. అవసరమైతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలి. కానీ అప్పటి ప్రభుత్వం ఇవేమీ చేయకపోగా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకుంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలపై ఏసీబీ ఆరా తీస్తుంది.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో : అలాగే 2022 అక్టోబరులో రేసు నిర్వహణకు ఒప్పందం కుదిరితే అదే ఏడాది ఏప్రిల్‌లో గ్రీన్‌కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ రూ. 31 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి. తిరిగి అక్టోబరులు మరో రూ. 10 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూర్చాయి. దీనిపై కూడా ఏసీబీ వివరాలు సేకరిస్తుంది. ఇప్పుడు సేకరిస్తున్న ఆధారాలు, డాక్యుమెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఏసీబీ విచారించనుంది. మరోవైపు ఈ కేసులో ఏ2, ఏ3 గా ఉన్న అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి నివాసాల్లో కూడా ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - క్వాష్ పిటిషన్ కొట్టివేత
కేటీఆర్‌కు మరోమారు ఏసీబీ నోటీసులు - ఈనెల 9న విచారణకు హాజరుకావాలని ఆదేశం