ETV Bharat / offbeat

పచ్చి బఠాణీలతో "ఇడ్లీలు, గుంట పొంగనాలు" - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! - GREEN PEAS BREAKFAST RECIPES

ఆరోగ్యాన్నిచ్చే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలు - సరికొత్త టేస్ట్​తో సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

GREEN PEAS IDLI RECIPE
Green Peas Breakfast Recipes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 11:55 AM IST

Green Peas Breakfast Recipes : పులావ్, బిర్యానీ, కిచిడీ, ఉప్మా, చాట్‌ ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచినీ, కంటికింపైన రంగునీ ఇస్తుంది పచ్చి బఠాణీ. ఇందులో పోషకాల మోతాదూ ఎక్కువే. అయితే, ఎప్పుడూ సైడ్ క్యారెక్టర్​గా కాకుండా చలికాలం ఎక్కువగా దొరికే పచ్చి బఠాణీలను మెయిన్ లీడ్ తీసుకుంటూ ఈ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలను ట్రై చేయండి. ఇవి నోటికి సరికొత్త టేస్ట్​ని అందించడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి! మరి, పచ్చి బఠాణీలతో ప్రిపేర్ చేసుకునే ఆ రెసిపీలేంటి? అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

ఇడ్లీలు :

కావాల్సిన పదార్థాలు :

  • 1 కప్పు - పచ్చి బఠాణీలు
  • 1 కప్పు - పెరుగు
  • 1 కప్పు - బొంబాయి రవ్వ
  • రెండు - పచ్చిమిర్చి
  • 2 టేబుల్​స్పూన్లు - ఆయిల్
  • అరటీస్పూన్ - ఆవాలు
  • 1 టీస్పూన్ - మినప్పప్పు
  • చిన్న ముక్క - అల్లం
  • కొద్దిగా - కరివేపాకు
  • 1 టీస్పూన్ - బేకింగ్ సోడా
  • రుచికి సరిపడా - ఉప్పు

పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్​ అద్దిరిపోతాయి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి బఠాణీలు, పచ్చిమిర్చి, అల్లంతో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి దింపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పచ్చి బఠాణీ పేస్ట్, పెరుగు, బొంబాయి రవ్వ, ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై వేయించుకున్న తాలింపునీ బఠాణీ మిశ్రమంలో వేసి కలపాలి.
  • ఆ తర్వాత అందులో బేకింగ్ సోడా, తగినన్ని వాటర్ వేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై ఇడ్లీ పాత్ర పెట్టి తగినన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. ఆలోపు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బఠాణీ మిశ్రమాన్ని వేసుకోవాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసి ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టాలి. ఆపై మీడియం ఫ్లేమ్​ మీద 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకొని స్టౌ ఆఫ్​ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "పచ్చి బఠాణీ ఇడ్లీలు" రెడీ!

ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఇడ్లీ/దోశ పిండి పులిసిపోతుందా ? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి - పైగా టేస్టీ కూడా!

పొంగనాలు :

కావాల్సిన పదార్థాలు :

  • 1 కప్పు - బొంబాయి రవ్వ
  • 1 కప్పు - పచ్చి బఠాణీలు
  • అర కప్పు - పెరుగు
  • అర కప్పు - వాటర్
  • 1 - ఉల్లిపాయ
  • రెండు - పచ్చిమిర్చి
  • 8 - వెల్లుల్లి రెబ్బలు
  • 1 టేబుల్​స్పూన్ - ఆయిల్
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు
  • అరటీస్పూన్ - కారం
  • అరచెంచా - జీలకర్ర పొడి
  • రుచికి సరిపడా - ఉప్పు
  • అరటీస్పూన్ - బేకింగ్ సోడా
  • పావుటీస్పూన్ - గరం మసాలా
  • పావుటీస్పూన్ - పసుపు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ, పెరుగు, వాటర్ వేసి బాగా కలిపి మూతపెట్టి 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం నానబెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలో బేకింగ్ సోడా, ఉప్పు వేసుకొని మరోసారి చక్కగా కలిపి పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చి బఠాణీలు, వెల్లుల్లి తరుగు వేసుకొని కలుపుతూ ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కాసేపటి తర్వాత దింపి చల్లార్చుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీజార్ తీసుకొని అందులో కుక్ చేసుకున్న పచ్చి బఠాణీల మిశ్రమం వేసుకొని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఈ పేస్ట్​ని ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి ఆయిల్ రాసిన గుంత పొంగనాలు పాత్రలో వేసి మూతపెట్టాలి.
  • ఒకవైపు వేగాక తిరగేసి అటు కూడా చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "పచ్చి బఠాణీ పొంగనాలు" రెడీ!
  • వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్​తో అద్దుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది!

గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.