తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంటకు 180 కి.మీ వేగంతో వందే భారత్‌ స్లీపర్‌ రయ్‌ రయ్‌ - ఈ వైరల్​ వీడియో చూశారా? - VANDE BHARAT SLEEPER SPEED

గంటకు 180 కి.మీ వేగంతో వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్​ - వీడియో చూశారా?

Vande Bharat Sleeper Express
Vande Bharat Sleeper Express (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 10:12 AM IST

Vande Bharat Sleeper Speed : దేశంలో మొదటిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు వీలుగా పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు.

అందులో వందే భారత్‌ స్లీపర్‌ రైలు 180 కి.మీ/గంట వేగంతో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది. అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.

వేగం పెరుగుతోంది!
తొలుత జనవరి 1న రైలును గంటకు 130 కి.మీ వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్‌ స్టేషన్ల మధ్య 180 కి.మీ/గంట వేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్‌ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్‌ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

మరికొన్ని నెలల్లో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్‌ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ(ఎస్​ఎల్​ఆర్​) కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details