వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి కొందరు.. ఉన్న ప్రేమను బలపరుచుకోవడానికి మరికొందరు.. ఇలా లవర్స్ అంతా ఫిబ్రవరి 14 కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా.. తమ లవర్ను ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పేందుకు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే.. గిఫ్టులు ఇవ్వడానికి కూడా వాస్తు చూడాలని చెబుతున్నారు కొందరు వాస్తు నిపుణులు. కొన్ని రకాల బహుమతులు ఇవ్వకూడదని చెబుతూ.. ఎలాంటివి ఇవ్వాలో సూచిస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఫిబ్రవరి నెల వచ్చిందంటే.. ప్రేమికుల్లో ఆనందం మరింతగా పెరిగిపోతుంది. వారి ఊహలకు మరింతగా రెక్కలు మొలుస్తాయి. తమ పార్ట్నర్ను ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పేందుకు ఎదురు చూస్తుంటారు. కొందరు ఫిబ్రవరి 14న ఓపెన్ అయిపోతే.. మరికొందరు ముందునుంచే ప్రేమ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇందుకోసం వాలెంటైన్ వీక్ ను ఫాలో అవుతుంటారు.
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఈ వారంలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. 7వ తేదీన "రోజ్ డే"తో మొదలై.. 13వ తేదీన "కిస్ డే"తో ముగుస్తుంది. ఆ తర్వాతి రోజున ఎంతగానో ఎదురు చూసే.. ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఈ లవర్స్ డే సందర్భంగా పార్ట్నర్స్.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ బహుమతుల్లో అదీ ఇదీ అని కాకుండా అన్ని రకాలూ ఉంటాయి. కొందరు పువ్వులు ఇచ్చుకుంటారు. మరికొందరు చాక్లెట్లు, టెడ్డీ బేర్ లాంటి బొమ్మలు, ఫొటో ఫ్రేమ్‌లు, ఫోన్లు వంటి.. అనేక వస్తువులను బహుమతిగా ఇస్తారు. అయితే.. వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం.. ఈ రోజున కొన్ని బహుమతులు ఇస్తే ఇద్దరి మధ్య ప్రేమస సంతోషం పెరుగుతాయి. మరికొన్ని బహుమతులు ఇస్తే ఇబ్బందులు రావొచ్చు అని చెప్తున్నారు.