తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాన్​ను​ ఢీకొట్టిన RTC బస్సు- 17కు చేరిన మృతుల సంఖ్య- రూ.4లక్షల ఎక్స్​గ్రేషియా! - Uttar Pradesh Road Accident

Uttar Pradesh Road Accident : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది.

Uttar Pradesh Road Accident
Uttar Pradesh Road Accident (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 7:54 PM IST

Updated : Sep 7, 2024, 11:47 AM IST

Uttar Pradesh Road Accident :ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 16 మంది ఆస్పత్రిలో ఉన్నారు. హాథ్రస్ ఆస్పత్రిలో 11 మంది, అలీగఢ్ హాస్పిటల్​లో ఐదుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

హాథ్రస్ జిల్లాలోని చాంద్​పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా వ్యాన్​లో హాథ్రస్​ నుంచి ఆగ్రాకు బయలుదేరారు. ఆగ్రా - అలీగఢ్​ జాతీయ రహదారిపై వెళ్తుండగా వ్యాన్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఓ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

మృతులను ఇర్షాద్ (25), మున్నె ఖాన్ (55), ముస్కాన్ (16), తల్లి (28), తబస్సుమ్ (28), నజ్మా (25), భోలా (25), ఖుష్బు (25), జమీల్ (50), చోటే (25), అయాన్ (2), సుఫియాన్ (1), అల్ఫాజ్ (6), షోయబ్ (5), ఇష్రత్ (50)గా పోలీసులు గుర్తించారు. అప్పి (2), గుల్షన్‌ అలీగఢ్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఘటనాస్థలికి యోగి ఆదిత్యనాథ్
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. ప్రమాదంలో పలువురు మరిణించారనే వార్త బాధకలిగించిందని అన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోందని ఎక్స్​లో పోస్ట్​ చేశారు. అంతేకాకుండా, మృతుల కుటంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

Last Updated : Sep 7, 2024, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details