Reasons for Couples Should to Travel Before Tying Marriage : అమ్మాయి, అబ్బాయి.. ఒకరినొకరు ఇష్టపడి వివాహం అనే సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక.. పెళ్లి. ఇలా ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టాక.. నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. కానీ, నేటి కాలపు జంటలకు నచ్చనప్పుడు విడిపోయే బంధంగా మారిపోయింది వివాహం. రోజులు గడిచేకొద్దీ.. ఒకరి అభిప్రాయాలు, అలవాట్లు మరొకరికి నచ్చకపోవడం, భాగస్వామి బోర్ కొట్టి వాని సాన్నిహిత్యాన్ని ఆస్వాదించలేకపోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల ఎన్నో జంటలు మధ్యలోనే విడిపోతున్నాయి. కాబట్టి, వివాహం(Marriage)తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఇద్దరూ ఏకాంతంగా కలిసి పర్యాటక ప్రాంతాలు లేదా ఇతర ప్రాంతాలను సందర్శించడం మంచిది అంటున్నారు నిపుణులు. అందుకు గల కారణాలను వివరిస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అవగాహన :పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి కలిసి ప్రయాణం చేయడం వల్ల ఒకరి గురించి మరొకరు లోతుగా అన్ని విషయాలూ అర్థం చేసుకోగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా భాగస్వామి ఎలాంటి వారు, వ్యక్తిత్వం ఏమిటి, తనను ఇబ్బంది పెట్టే అంశాలేంటి, సంతోషపరిచేవేంటి.. ఇలా అన్ని విషయాలపై ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. జర్నీలో ఎక్కువ గంటలు, రోజులు కలిసి గడుపుతారు కాబట్టి.. సవివరంగా తెలుసుకోవచ్చంటున్నారు.
ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుంటారు :వివాహానికి ముందు కాబోయే దంపతులు కలిసి జర్నీ చేయడం వల్ల మీ పార్ట్నర్కు నచ్చిన ఆహారం మొదలు.. వారి ఇష్టాఇష్టాలన్నీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఫ్రీ టైమ్లో వారు ఎలా గడపడానికి ఇష్టపడతారో తెలుసుకోవచ్చంటున్నారు.