ETV Bharat / bharat

శ్రావణం స్పెషల్ : కమ్మనైన "కట్టె పొంగలి" - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే గుడిలో ప్రసాదాన్ని మించిన టేస్ట్! - Katte Pongali Recipe

Ven Pongal Recipe: చాలా మందికి గుడిలో పెట్టే కట్టె పొంగలి అంటే ఇష్టం. దానిని ఇంట్లో తయారు చేయాలని కూడా ట్రై చేస్తుంటారు. కానీ అంత పర్ఫెక్ట్​గా రాదు. దీంతో ఫీలవతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే గుడిలో పెట్టే ప్రసాదాన్ని మించిన టేస్ట్ వస్తుంది! మరి, దీన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Katte Pongali
Ven Pongal Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 12:32 PM IST

How To Make Temple Style Katte Pongali: కట్టె పొంగలి.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంది. కారణం.. ఘుమఘుమలాడే వాసనతో.. అద్భుతమైన టేస్ట్​ను కలిగి ఉంటుంది. ఇక గుడిలో పెట్టే ఈ ప్రసాదానికి కూడా ఫ్యాన్స్​ ఎక్కువే. అంతేనా పండగలప్పుడు చాలా మంది ఇంట్లో కూడా చేసుకుంటుంటారు. మరికొంతమంది ఉదయం టిఫెన్​లాగ కూడా తింటుంటారు. అయితే ఎన్నిసార్లు ఇంట్లో ఈ రెసిపీ చేసినా ఎదో మిస్​ అయినట్లు అనిపిస్తుంది కానీ గుడిలో చేసిన టేస్ట్​ మాత్రం రాదు. కాబట్టి ఈసారి కట్టె పొంగలి చేసేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే గుడిలో పెట్టే ప్రసాదాన్ని మించిన టేస్ట్​ వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెసరపప్పు - 1 కప్పు
  • బియ్యం - 1 కప్పు
  • వాటర్​ - 6 కప్పులు
  • బటర్ - పావు కప్పు
  • నెయ్యి - ముప్పావు కప్పు
  • మిరియాలు - 1 టేబుల్​స్పూన్
  • అల్లం తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి - 8
  • జీలకర్ర - అర టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 4
  • జీడిపప్పు పలుకులు - అర కప్పు
  • కరివేపాకు - కొద్దిగా
  • ఇంగువ - పావు టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • కట్టె పొంగలి తయారు చేయడానికి ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని పెసరపప్పు(Pesarapappu)ను లో ఫ్లేమ్ మంట మీద 8 నుంచి 10 నిమిషాల పాటు దోరగా వేయించుకుని ఓ బౌల్​లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత వేయించిన పెసరపప్పులో బియ్యాన్ని పోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యాన్ని, పప్పను నీరు పోసి నానబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కడిగితే సరిపోతుంది. అలాగే పెసరపప్పును ఏ కప్పుతో తీసుకున్నారో.. అదే కప్పుతో బియ్యం, వాటర్​ను తీసుకోవాలి.
  • అనంతరం స్టౌపై ఒక బౌల్ పెట్టుకొని అందులో 6 కప్పుల వాటర్ పోసుకొని మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మరిగించుకోవాలి.
  • ఈలోపు మరో స్టవ్​ మీద కుక్కర్ పెట్టి బటర్ వేసుకోవాలి. అది కరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పొంగలికి కమ్మటి వాసన, మంచి రుచి వస్తుంది.
  • అది వేగిన తర్వాత.. మరుగుతున్న వాటర్ పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి కలిపి మూతపెట్టుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకున్న తర్వాత.. కుక్కర్​లోని ప్రెజర్ పోయాక మూత తీసి ఓసారి కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోలేదనుకుంటే కాస్త వేడి నీరు పోసుకుని కాసేపు బాయిల్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కుక్కర్​ను మూత తీసి స్టవ్​ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే అదనపు వాటర్ గుంజుకుంటుంది.
  • ఇప్పుడు తాలింపు కోసం వేరే స్టవ్​ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక మిరియాలు, అల్లం తరుగు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  • అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక.. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. అంటే.. జీడిపప్పులు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది.
  • ఆ తర్వాత అందులో కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ తాలింపును మరో బర్నర్ మీద ఉడికిస్తున్న పొంగలిలో వేసుకొని కలుపుకోవాలి. ఆపై దాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "కమ్మనైన కట్టె పొంగలి" రెడీ!

ఇవీ చదవండి :

సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్​ సూపర్​! తింటే వదిలిపెట్టరు!

ఛాయ్​ చేసినంత సులువుగా అద్దిరిపోయే "పనీర్ ఖీర్" - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.