Telangana Tourism Tour Packages : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు.. తెలంగాణ టూరిజం అందుబాటు ధరల్లోనే వివిధ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలలో కొన్ని ఒక్కరోజు ట్రిప్‌లు కూడా ఉన్నాయి. టూర్‌లకు వెళ్లడానికి రెండుమూడు రోజుల సమయం లేని వారు ఫ్యామిలీతో కలిసి ఈ ఒక్కరోజు టూర్ ప్యాకేజీలనుఎంజాయ్ చేయవచ్చు. తాజాగా.. ఈ సంస్థ ఓ బెస్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం(Telangana Tourism )హైదరాబాద్ నుంచి బీచ్‌పల్లి, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీని హైదరాబాద్, బీచ్‌పల్లి, అలంపూర్ టెంపుల్స్ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కృష్ణ, తుంగభద్ర నది మధ్య ప్రాంతంలో వెలసిన ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ టూర్‌ను నిర్వహిస్తున్నారు.
"అల పాపికొండల్లో విహరిద్దామా" - తక్కువ ధరలో తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!