Gujarat Giants vs UP Warriorz WPL 2025 : 2025 డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. యూపీ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గార్డ్నర్ (52 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించింది. చివర్లో హర్లీన్ డియోల్ (34* పరుగులు), డాటిన్ (33* పరుగులు) ఆకట్టుకున్నారు. యూపీ బౌలర్లలో సోఫీ 2, గ్రేస్ హరీస్, మెక్ గ్రాత్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ బెత్ మూనీ (0), హేమలత (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఈ దశలో వాల్వార్ట్ (22 పరుగులు), గార్డ్నర్తో కలిసి భాగస్వామ్యం నిర్మించింది. మూడో వికెట్‌కు వీళ్లిద్దరూ 55 పరుగుు జోడించి విజయానికి పునాది వేశారు. 8.3 ఓవర్ వద్ద వాల్వార్ట్ను సోఫీ క్లీన్‌బౌల్డ్ చేసింది. తర్వాత 86 పరుగుల వద్ద గార్డ్నర్ కూడా పెవిలియన్ చేరింది. తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్, డాటిన్ నిలకడగా రాణించి మ్యాచ్ పూర్తి చేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (39 పరుగులు) రాణించింది. ఉమా ఛెత్రి (24 పరుగులు), అలన కింగ్ (19 పరుగులు) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా 3, అషిలీ గార్డ్నర్, డాటిన్ తలో 2, కేశవీ గౌతమ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
🔙 to 🔙 FIFTIES 🔥
— Women's Premier League (WPL) (@wplt20) February 16, 2025
Skipper Ash Gardner picks up right where she left off 🔥
Will she guide #GG home tonight? 🤔
Updates ▶ https://t.co/KpTdz5nl8D#TATAWPL | #GGvUPW | @Giant_Cricket pic.twitter.com/ZtYLOZ6i56