తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాముడి జీవనం జాతి నిర్మాతలకు స్ఫూర్తి- ప్రధాని మోదీ చేస్తున్నది పవిత్ర కార్యక్రమం!' - ayodhya ram mandir opening

Prana Pratishtha Ceremony President : బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండుపుటల లేఖ రాశారు. ఈ మహోత్సవాన్ని చూడటం ప్రజలందరి అదృష్టమన్నారు. శ్రీరాముడి జీవనం జాతి నిర్మాతలకు స్ఫూర్తి అని, సుపరిపాలన అంటే రామరాజ్యమేని రాష్ట్రపతి చెప్పారు.

Prana Pratishtha Ceremony President
Prana Pratishtha Ceremony President

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 7:54 AM IST

Updated : Jan 22, 2024, 9:47 AM IST

Prana Pratishtha Ceremony President : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణం, దేశ శాశ్వత ఆత్మ, పునరుజ్జీవనంలో కొత్త చక్రానికి నాంది పలికిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇది దేశంలో తొలి అధ్యాయ ప్రారంభానికీ దారి తీసిందిని తెలిపారు. అలానే ప్రజలందరి అదృష్టమన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందలు తెలుపుతూ రెండు పేజీల లేఖను రాశారు.

'ప్రధాని చేస్తున్నది పవిత్ర ఆచారం'
బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న 11రోజుల దీక్షను రాష్ట్రపతి తన లేఖలో ప్రస్తావించారు. అది పవిత్రమైన కార్యక్రమం మాత్రమే కాదు, రాముడికి భక్తితో సమర్పించే అత్యున్నత ఆధ్యాత్మిక క్రతువు అని కొనియాడారు. రాముడు తన జీవితంలో పాటించిన విలువలు, ధైర్యం, కరుణ, విధి నిర్వహణపై దృష్టిపెట్టడం వంటి అంశాలు ఈ అద్భుతమైన ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తామని ద్రౌపది ముర్ము చెప్పారు. "సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన ఉత్తమ అంశాలను శ్రీరామ ప్రభువు సూచిస్తారు. అన్నింటికంటే మించి చెడుతో నిరంతర పోరాటం ద్వారా మంచిని సూచిస్తాడు. రాముడి జీవితం, ఆయన పాటించిన సూత్రాలు దేశ చరిత్రలోని అనేక అంశాలను ప్రభావితం చేయటం సహా దేశ నిర్మాతలను ప్రేరేపించాయి. గాంధీజీ వంటి వారికి రాముడే స్ఫూర్తి అని అందుకే మహాత్ముడు తన చివరిశ్వాస వరకు రామనామం స్మరించారు. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తుకు వస్తుంది" అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన లేఖలో పేర్కొన్నారు.

లేఖపై ప్రధాని మోదీ స్పందన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్​లో ట్వీట్​ చేశారు. "ఈ చారిత్రాత్మక ఘట్టం భారతీయ వారసత్వం, సంస్కృతిని మరింత సుసంపన్నం చేస్తుంది. మన అభివృద్ధి ప్రయాణం కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు - 500 ఏళ్ల రామమందిరం కలలో అడ్డుంకులెన్నో

బాలరాముడి పీఠం కింద మహా యంత్రం- తయారు చేసింది చీరాల ఆయనే!- విగ్రహం ఎలా ప్రతిష్ఠిస్తారు?

Last Updated : Jan 22, 2024, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details