తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మణిపుర్​లో టెన్షన్​ టెన్షన్​ - 50 CAPF కంపెనీల బలగాలు తరలిస్తున్న కేంద్రం - MANIPUR VIOLENCE TODAY

Manipur Violence Today
Manipur Violence Today (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 12:30 PM IST

Updated : Nov 18, 2024, 6:28 PM IST

Manipur Violence Today : మణిపుర్​లో కల్లోల పరిస్థితి నెలకొన్నాయి. తాజాగా భద్రతా బలగాలు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జవాన్లు కాల్పులు జరపడం వల్లే అతడు చనిపోయాడని స్థానికులు అంటున్నారు.

ఇటీవల మహిళలు పిల్లలు సహా ఆరుగురిని కుకి మిలిటెంట్లు అపహరించారు. అనంతరం వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు కిడ్నాప్​ అయినప్పటి నుంచి మణిపుర్​లో హింసాత్మక వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితిపై సోమవారం అమిత్​ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు.

LIVE FEED

6:15 PM, 18 Nov 2024 (IST)

హింసతో అట్టుడుకుతున్న మణిపుర్‌ - ఎప్పుడు ఏమౌతుందో?

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో భద్రతా బలగాలు పహారా పెంచాయి. ఉద్రిక్త పరిస్థితులు కారణంగా రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండురోజుల పాటు పాఠశాలలు, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అదనంగా మరో 5 వేల మందితో కూడిన భద్రత బలగాలను మణిపుర్‌కు పంపనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

హింసాత్మకంగా!
మణిపుర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేస్తుండడంతో భద్రత బలగాలు పహారా పెంచాయి. ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏడు జిల్లాలో అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండు రోజుల పాటు పాఠశాలలు, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు పశ్చిమ ఇంఫాల్‌లో ఆందోళనకారులు నిరసనలు చేశారు. మణిపుర్​లో హింసను కట్టడి చేయడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాని ఆరోపిస్తూ కోకోమి సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యాలయాలను కోకోమి సంస్థ సభ్యులు మూసివేశారు. మణిపుర్‌ రాష్ట్ర కార్యాలయం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిరసనకారులు తాళాలు వేశారు.

ఎన్​ఐఏ దర్యాప్తు
మణిపుర్‌లో చెలరేగిన తాజా హింసపై నమోదైన మూడు కేసుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్​ఐఏ దర్యాప్తును చేపట్టింది. ప్రాణనష్టం, శాంతిభద్రతలకు విఘాతం కలగడం వల్ల దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. కుకీ మిలిటెంట్లకు, సీఆర్​పీఎఫ్​ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు మృతిచెందిన కేసుతో పాటు, ఆరుగురు పౌరుల అపహరణ, హత్య కేసులను ఎన్​ఐఏ దర్యాప్తు చేయనుంది. సాయుధ మిలిటెంట్లు ఓ మహిళను హత్య చేసిన ఘటనపై నవంబర్‌ 8న జిరిబామ్ జిల్లాలో మెుదటి కేసు నమోదైంది. సీఆర్​పీఎఫ్​ పోస్టుపై సాయుధ మిలిటెంట్లు దాడి చేసిన ఘటనపై రెండో కేసు నమోదవ్వగా, పౌరుల హత్య, ఇళ్లకు నిప్పంటించిన ఘటనపై మూడో కేసు నమోదైంది. ఈ మూడు కేసులపై ఎన్​ఐఏ దర్యాప్తు చేపట్టింది.

అదనపు బలగాలు మోహరింపు
మణిపుర్‌లో హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం జరుగుతోన్న అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అదనంగా మరో 5000 మంది భద్రత బలగాలను మణిపుర్‌కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 50 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌- సీఏపీఎఫ్​ కంపెనీలకు చెందిన బలగాలను మణిపుర్‌కు పంపనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 35 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్- సీఆర్​పీఎఫ్​ బెటాలియన్లను, 15 బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్​ బెటాలియన్లను కేంద్రం పంపనుంది. ఆరుగురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయటంతో నవంబర్‌ 12న జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింస మణిపుర్‌ మెుత్తం వ్యాపించింది. ఈ అల్లర్లను కట్టడి చేసేందుకు ఇప్పటికే కేంద్రం 20 సీఏపీఎఫ్​ బృందాలు, 12 సీఆర్​పీఎఫ్​ బృందాలు, 5 బీఎస్​ఎఫ్ బృందాలను మెహరించింది. తాజాగా వాటికి అదనంగా 50 బృందాలతో కూడిన 5000 మందిని పంపించనుంది.

2:21 PM, 18 Nov 2024 (IST)

మణిపుర్​కు 50 సీఏపీఎఫ్ కంపినీల బలగాలు

మణిపుర్​లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం- 50 సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్స్​(సీఏపీఎఫ్​) కంపెనీల బలగాలను తరలిస్తోంది. మొత్తంగా 5000 మంది సిబ్బందిని మణిపుర్​ పంపించింది.

1:07 PM, 18 Nov 2024 (IST)

నిరసనకారుడు మృతి

మణిపుర్​లోని జిరిబామ్​ జిల్లాలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ నిరసనకారుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. అయితే ఎవరు కాల్పులు జరిపారు అనే విషయంపై స్పష్టత లేదు. కానీ భద్రతా బలగాలే కాల్పులు జరిపినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నాడు.

మిలిటెంట్లు మహిళలు చిన్నారులను అపహరించి చంపేసిన ఘటనకు వ్యతిరేకంగా జిరిబమ్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బాబుపరా వద్ద కొంతమంది నిరసనకు దిగారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ప్రాపర్టీలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఓ నిరసనకారుడు మృతిచెందాడు. మృతుడిని దాదాపు 20 ఏళ్ల వయసున్న కే అతౌబాగా గుర్తించారు.

అయితే కాంగ్రెస్​, బీజేపీకి చెందిన కార్యాలయాలు, స్వంతంత్ర ఎమ్మెల్యే ఇల్లుపై నిరసనకారులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. వారి ఇంట్లో ఉన్న ఫర్నిచర్, పేపర్లు సహా తదితర వస్తువులను ఇంటి బయట కాల్చివేశారని చెప్పారు.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇంఫాల్​ వ్యాలీలో కర్ఫూ కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఫార్మసీలు మినహా మార్కెట్​లు, వ్యాపారాలు మూసేశారు. మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్​ను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, రాజ్​భవన్​కు వెళ్లే ప్రధాని రహదారుల్లో బలగాలను మోహరించారు.

1:02 PM, 18 Nov 2024 (IST)

మణిపుర్​ పరిస్థితిపై అమిత్​ షా కీలక సమావేశం

మణిపుర్​లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కీలక సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. మణిపుర్​లో ఉన్న అస్థిర పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి వ్యూహాన్ని రూపొందించే విషయంపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ దేకా తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అంతకుముందు మహారాష్ట్రలో ఎన్నికల ర్యాలీని రద్దు చేసుకుని అమిత్​ షా మణిపుర్​ పరిస్థితిపై సమీక్షించారు.

12:56 PM, 18 Nov 2024 (IST)

3 మణిపుర్ హింస​ కేసులపై ఎన్​ఐఏ దర్యాప్తు

మణిపుర్​లో హింసకు సంబంధించి 3 కేసుల దర్యాప్తు బాధ్యతలను ఎన్​ఐఏ తీసుకుంది. ఈ మేరకు ఆ కేసులను మణిపుర్​ పోలీసుల నుంచి ఎన్​ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్​పీఎఫ్, కుకి మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 10మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఆరుగురు వ్యక్తులను మిలిటెంట్లు అపహరించి చంపేశారు. మరో ఘటనలకు సంబంధించిన కేసులతో పాటు మరో కేసును ఎన్​ఐఏకు బదిలీ చేశారు.

12:44 PM, 18 Nov 2024 (IST)

బీజేపీకి NPP మద్దతు ఉపసంహరణ

బీజేపీకి నేషనల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీపీ) ఆదివారం మద్దతు ఉపసంహరించుకుంది. మణిపుర్​లో సంక్షోభాన్ని నియంత్రించడంలో శాంతి స్థానపనలో సీఎం ఎన్ బిరేన్ సింగ్ విఫలమయ్యారని ఎన్​పీపీ ఆరోపించింది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ఎన్​పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Last Updated : Nov 18, 2024, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details