ETV Bharat / bharat

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది : రాష్ట్రపతి - PARLIAMENT BUDGET SESSION 2025

Parliament Budget Session 2025
Parliament Budget Session 2025 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 10:25 AM IST

Updated : Jan 31, 2025, 12:54 PM IST

Parliament Budget Session 2025 : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెడతారు.

LIVE FEED

11:58 AM, 31 Jan 2025 (IST)

ఎంఎస్‌ఎంఈల కోసం క్రెడిట్‌ గ్యారంటీ పథకం తీసుకువచ్చాం: రాష్ట్రపతి

  • ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగయ్యాయి: రాష్ట్రపతి
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది: రాష్ట్రపతి
  • కచ్చిత వాతావరణ సమాచారానికి రూ.2 వేల కోట్లతో మిషన్‌ మౌసమ్‌ కార్యక్రమం: రాష్ట్రపతి
  • ఉదమ్‌పూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైలు అనుసంధాన ప్రాజెక్టు పూర్తి: రాష్ట్రపతి
  • అనుసంధానంతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేలైన్‌ అందుబాటులోకి వచ్చింది: రాష్ట్రపతి
  • ఎంఎస్‌ఎంఈల కోసం క్రెడిట్‌ గ్యారంటీ పథకం తీసుకువచ్చాం: రాష్ట్రపతి

11:37 AM, 31 Jan 2025 (IST)

డిజిటల్‌ సాంకేతికతలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తోంది: రాష్ట్రపతి

  • స్టార్టప్‌లు, క్రీడలు, అంతరిక్ష రంగాల్లో యువత దేశానికి వన్నె తెస్తోంది: రాష్ట్రపతి
  • మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌ సేవల కల్పనలో మహిళలు కీలకపాత్ర: రాష్ట్రపతి
  • నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశాం: రాష్ట్రపతి
  • మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేసే రోజు ఎంతో దూరంలో లేదు: రాష్ట్రపతి
  • కృత్రిమమేధ అభివృద్ధికి ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం: రాష్ట్రపతి
  • డిజిటల్‌ సాంకేతికతలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తోంది: రాష్ట్రపతి
  • సామాజిక న్యాయం, సమానత్వ సాధనకు డిజిటల్‌ సాంకేతికత వాడుతున్నాం: రాష్ట్రపతి

11:21 AM, 31 Jan 2025 (IST)

యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి: రాష్ట్రపతి

  • ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పనిచేస్తోంది: రాష్ట్రపతి
  • కొత్త పథకాలు వేగవంతంగా అమలు చేస్తున్నాం: రాష్ట్రపతి
  • త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారనుంది: రాష్ట్రపతి
  • ఒకే దేశం-ఒకే ఎన్నికలు, వక్ఫ్‌ బోర్డు అంశాలపై సాహసోపేత నిర్ణయాలు: రాష్ట్రపతి
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూర్చుతున్నాయి: రాష్ట్రపతి
  • 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆరోగ్యబీమా: రాష్ట్రపతి
  • పీఎం ఆవాస్‌ యోజన ద్వారా మరో 3 కోట్ల కుటుంబాలకు ఇళ్లు: రాష్ట్రపతి
  • చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు: రాష్ట్రపతి
  • యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి: రాష్ట్రపతి
  • 25 కోట్ల మంది పేదలను దారిద్ర్యం నుంచి బయటకు తెచ్చాం: రాష్ట్రపతి
  • మహిళలు వేగంగా సాధికారత సాధించే దిశగా చర్యలు: రాష్ట్రపతి

11:11 AM, 31 Jan 2025 (IST)

  • ఇటీవలే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం: రాష్ట్రపతి
  • మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభించుకుంటున్నాం: రాష్ట్రపతి
  • కుంభమేళా తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
  • గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా
  • ఇటీవలే కన్నుమూసిన మన్మోహన్‌ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా: రాష్ట్రపతి
  • బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యత: రాష్ట్రపతి
  • పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం: రాష్ట్రపతి
  • పీఎం ఆవాస్‌ యోజన ద్వారా లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం: రాష్ట్రపతి
  • అమృత్ భారత్‌, నమో భారత్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నాం: రాష్ట్రపతి

  • విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది: రాష్ట్రపతి

10:47 AM, 31 Jan 2025 (IST)

గుర్రపు బగ్గీలో పార్లమెంటుకు రాష్ట్రపతి

  • కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు
  • రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంటుకు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
  • గుర్రపు బగ్గీలో పార్లమెంటుకు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
  • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

10:34 AM, 31 Jan 2025 (IST)

'దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌'

  • రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం : ప్రధాని మోదీ
  • కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది : ప్రధాని మోదీ
  • పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం : ప్రధాని మోదీ
  • పార్లమెంటులో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి : ప్రధాని మోదీ
  • కేంద్ర బడ్జెట్‌ ద్వారా ప్రజలకు విశేష లబ్ధి చేకూరుతుంది : ప్రధాని మోదీ
  • కేంద్రం, రాష్ట్రం, ప్రజల సహకారంతో సంస్కరణలు అమలు : ప్రధాని మోదీ
  • సమృద్ధ, వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు సాగాలి : ప్రధాని మోదీ
  • వికసిత్‌ భారత్‌కు పార్లమెంటు మరింత బలం చేకూర్చుతుంది : ప్రధాని మోదీ
  • పార్లమెంటు చర్చల్లో సభ్యులందరూ భాగస్వాములు కావాలి : ప్రధాని మోదీ
  • దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుంది : ప్రధాని మోదీ

10:28 AM, 31 Jan 2025 (IST)

ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోదీ

  • మహాలక్ష్మికి ప్రణామాలు. మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధిని ఇస్తుంది : ప్రధాని మోదీ
  • పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలి : ప్రధాని మోదీ
  • భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి : ప్రధాని మోదీ
  • మూడోసారి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారు : ప్రధాని మోదీ
  • పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం : ప్రధాని మోదీ
  • ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోదీ
  • భారత్‌ అభివృద్ధి లక్ష్యంతో మిషన్‌ మోడ్‌లో ముందుకెళ్తున్నాం : ప్రధాని మోదీ
  • ఇన్నొవేషన్‌, ఇన్‌క్లూషన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంతో దూసుకెళ్తున్నాం : ప్రధాని మోదీ

10:14 AM, 31 Jan 2025 (IST)

బడ్జెట్​ సమావేశాల్లో పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. మహా కుంభమేళాలో తొక్కిసలాటపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్​ చేయనున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో గురువారం అఖిల పక్ష సమావేశం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగింది. అందులో పార్లమెంటరీ కమిటీలపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఎక్కువ మంది కమిటీల్లో ఉండటంవల్ల అవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు గుప్పించాయి.

స్వపక్షాల విజ్ఞప్తులు ఇవే!
ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించాలని ఆల్​ పార్టీ మీటింగ్​లో సమావేశంలో బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీయూ కోరింది. బిహార్‌కు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని మరో అధికార పక్ష పార్టీ ఎల్​జేపీ విజ్ఞప్తి చేసింది. ఇక సభలో సీట్లను మార్చాలని, మాట్లాడేందుకు మరింత సమయం ఇవ్వాలని జేడీయూ, టీడీపీ, ఎల్​జేపీ కోరినట్లు సమాచారం.

Last Updated : Jan 31, 2025, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.