Minister Sridhar Babu On Drone Technology : తెలంగాణ రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు పలు సంస్థలు ముందుకొచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ ఏడాది నూతనంగా 500 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు. సెంటిలియాన్, హెచ్‌పీ రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో శ్రీధర్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నమ్మకం కలిగించే విధంగా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ పరిశ్రమలను విస్తరించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
'ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు' : హరీశ్‌రావుపై శ్రీధర్‌బాబు సీరియస్
'కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ ఆపలేరు' - Lok Sabha Elections 2024