IRCTC Treasures of Tamil Nadu Tour Package:తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అంటే.. శ్రీ రంగం ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం సహా ఇతర దేవాలయాలు గుర్తొస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే సరిగా ప్లాన్ చేసుకోలేక కొందరు.. ప్రయాణ ఛార్జీల కారణంగా మరికొందరు ముందుకు వెళ్లలేరు. అయితే ఇలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి టూర్ ఎలా సాగుతుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వంటి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి..
ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు(Treasures of Tamil Nadu) పేరుతో ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్లో తమిళనాడులోని కుంభకోణం, రామేశ్వరం, మధురై, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు.
అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్‌లు కూడా!
ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ (6E 2073) జర్నీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోగా అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి శ్రీరంగం ఆలయాన్ని, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తంజావూరుకు వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కుంభకోణంకి బయలుదేరి వెళ్లి.. అక్కడ ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోని హోటల్లో స్టే చేస్తారు.
- మూడో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చిదంబరానికి బయలుదేరుతారు. అక్కడ నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత గంగైకొండ చోళపురం వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి కుంభకోణం చేరుకుంటారు. భోజనం అనంతరం కుంభకోణంలోని స్థానిక ఆలయాలను(కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయం) సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోనే బస ఉంటుంది.
IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం!
- నాలుగో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత రామేశ్వరం వెళ్తారు. మధ్యాహ్నానికి రామేశ్వరం చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి రామేశ్వరంలో బస చేస్తారు.
- ఐదో రోజు ఉదయాన్నే దనుష్కోడిని సందర్శిస్తారు. అనంతరం హోటల్లో బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శిస్తారు. ఆ తర్వాత మధురైకి బయలుదేరి వెళ్తారు. రాత్రికి మధురైలో బస చేస్తారు.
- ఆరో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లైట్‌లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ధరలు చూస్తే..
- కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ, 39,850, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.30,500, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.26,800గా నిర్ణయించారు.
- ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.26,800, విత్ అవుట్ బెడ్ రూ.22,600గా నిర్ణయించారు.
- ప్రస్తుతం ఈ టూర్ ఆగష్టు 13న అందుబాటులో ఉంది.
- ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అటు భగవత్ దర్శనాలు - ఇటు బీచ్‌లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!