ETV Bharat / state

ఇన్‌స్టాలో పరిచయం - ఆపై అపహరించి మైనర్​పై అత్యాచారం - RAPED A MINOR GIRL IN ADILABAD

మైనర్ వైద్య విద్యార్థినితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం - వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన యువకుడు

Young Man Kidnapped And Raped A Minor Girl Who Met On Instagram in Adilabad
Young Man Kidnapped And Raped A Minor Girl Who Met On Instagram in Adilabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 11:34 AM IST

Young Man Kidnapped And Raped A Minor Girl Who Met On Instagram in Adilabad : ఓ మైనర్‌ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్​లో యువకుడు పరిచయం అయ్యాడు. అనంతరం మైనర్​ను అపహరించి అత్యాచారం చేసిన ఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్​లోని ఓ మెడికల్ కాలేజ్​లో విద్యను అభ్యసిస్తున్న బాలిక (17)కు ఇన్‌స్టాగ్రామ్​లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకులకు చెందిన శివ (22) అనే యువకుడు పరిచయం అయ్యాడు.

శివ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్‌కు వెళ్లి శివని కలుసుకుంది. అనంతరం ఆ యువకుడు బాలికను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. బాలిక మెడికల్ కాలేజ్​లో కనిపించకపోవడంతో సిబ్బంది విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆదిలాబాద్‌కు రప్పించారు.

అనంతరం బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ వాంగ్మూలం మేరకు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ కరుణాకర్‌ రావు వివరించారు.

పోయిన బర్రె కోసం వెతుకుతుంటే - ఎవరూ చూడని మానవ మృగాలు బయటపడ్డాయి

ఆటోలో అమ్మాయితో అసభ్య ప్రవర్తన - తరువాత ఇంటికొచ్చి ఎత్తుకెళ్లే యత్నం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.