Hero Manchu Manoj Went To Chandragiri Police Station To Meet DSP : నటుడు మంచు మనోజ్ ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బుధవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనికపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసు అధికారులను ప్రశ్నించగా, శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.
ఎవరిని అడగాలి : అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 'మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి?' అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు.
మంచు ఫ్యామిలీలో మళ్లీ మంటలు - విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్
కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోపలికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం మనోజ్ దంపతులు భారీ బందోబస్తు నడుమ తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ క్రమంలో మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితి అదుపు చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. పోలీస్‌స్టేషన్ వద్ద ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా మనోజ్‌కు ఉన్నట్లుండి కడుపునొప్పి వచ్చి ఇబ్బందిపడ్డారు. వెంటనే ఆయనకు నీరందించారు. ఆ సమయంలో ఆయనకు ధైర్యం చెబుతూ మౌనిక కన్నీటి పర్యంతమయ్యారు.
మంచు కుటుంబంలో ఆగని మంటలు - యూనివర్సిటీ గేటు ముందు లొల్లి
'జనరేటర్లో పంచదార'లో ఏమాత్రం నిజం లేదు : మోహన్‌బాబు భార్య లేఖ