ETV Bharat / offbeat

చేదు లేని "కాకరకాయ కొత్తిమీర కారం" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇష్టంగా తినేస్తారు! - KAKARAKAYA KOTHIMEERA KARAM

- ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ - ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే!

KAKARAKAYA Karam Recipe
Kakarakaya Kothimeera Karam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 4:27 PM IST

Kakarakaya Kothimeera Karam Recipe in Telugu : కాకరకాయ అనగానే చాలా మంది ముఖం విరుస్తారు. ఇక పిల్లలైతే కాకరకాయ పేరు వినడానికి కూడా ఇష్టపడరు. చేదుగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే, మీకోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, కాకరకాయ కొత్తిమీర కారం. ఈ స్టైల్​లో చేసి పెట్టారంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఆ రుచీ, పరిమళం అంత అమోఘంగా ఉంటాయి. వేడివేడి అన్నంలో దీన్ని కాస్త వేసుకొని తింటుంటే మీకు తెలియలేకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తారు. పైగా దీన్ని ఎవరైనా చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - అరకిలో
  • నూనె - పావు కప్పు
  • పల్లీలు - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్​ది)
  • బెల్లం తురుము - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర కారం కోసం :

  • కొత్తిమీర తరుగు - 100 గ్రాములు
  • పచ్చిమిర్చి - నాలుగైదు
  • చింతపండు - చిన్న ఉసిరికాయ సైజంత
  • అల్లం - అంగుళం ముక్క

తయారీ విధానం :

  • ముందుగా చాకు లేదా పీలర్ సహాయంతో కాకరకాయలపై ఉండే చెక్కును తొలగించుకోవాలి. ఆపై వాటిని నిలువుగా మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న గింజల భాగాన్ని తొలగించాలి. ఆ తర్వాత సన్నని నిలువు ముక్కలుగా చీల్చి అంగుళం సైజ్​లో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక బౌల్​లోకి సన్నగా కట్​ చేసుకున్న కాకర ముక్కలను తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కోట్ చేసి 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • అరగంట తర్వాత ఉప్పులో ఊరిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని చేతితో గట్టిగా పసరు పిండి మరో బౌల్​లో వేసుకొని పక్కనుంచాలి. ఇలా చేయడం ద్వారా చేదు చాలా వరకు తగ్గిపోతుంది.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పల్లీలను వేసి దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
  • అనంతరం అందులో పసరు పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు వేసుకొని కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆ తర్వాత మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ సుమారు 18 నుంచి 20 నిమిషాల పాటు కాకరకాయ ముక్కలను వేగనివ్వాలి. అంటే కాకర ముక్కలు 80శాతం వరకు ఉడికేలా చక్కగా వేయించుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన కొత్తిమీర కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కాడలతో సహా తరుక్కున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం ముక్క వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వేయించుకున్న పల్లీలతో పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం కాకరకాయ ముక్కలు చక్కగా వేగి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చాయనుకున్నాక అందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా కలిపి చక్కగా వేయించుకోవాలి.
  • అలా వేయించుకునేటప్పుడు బెల్లం తురుము, ఉప్పుతో పాటు అవసరమైతే కాస్త వాటర్ వేసుకొని బాగా కలిపి మూతపెట్టుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీద సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఘుమఘుమలాడే "కాకరకాయ కొత్తిమీర కారం" రెడీ!

ఇవీ చదవండి :

తెలంగాణ స్టైల్​ "వంకాయ కొత్తిమీర కారం" - కిర్రాక్​ టేస్ట్​తో అన్నం, చపాతీల్లోకి సూపర్​ కాంబినేషన్​!

బంధువులు వస్తే చికెన్, మటన్ కంటే - ఇలా "పాలకూర ఉల్లికారం" చేసి పెట్టండి! - ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.