MUTTON REHEATING HEALTH PROBLEMS : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగల్లో సంక్రాంతి ముందు వరసలో ఉంటుంది. ఎక్కడెక్కడో నివసిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు అంతా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటారు. భారీగా పిండివంటలు తయారు చేయడం మొదలు నాన్ వెజ్ కూడా ఎక్కువగానే కుక్ చేస్తారు. చాలా మంది మార్కెట్లో మటన్ కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు గ్రూప్ ఏర్పడి యాట కోస్తుంటారు. కాస్త ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలైతే సొంతంగా ఇంటికోసమే యాటను తెచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వండిన కూర మర్నాడుకు మిగిలిపోతుంది.
అసలే చలికాలం కావడం వల్ల ఉదయానికి కర్రీ చాలా చల్లగా మారిపోతుంది. దీంతో, భోజనాల సమయానికి మళ్లీ దాన్ని వేడి చేస్తారు. ఇది చాలా ఇళ్లలో చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడూ చూద్దాం.
మటన్ కుక్ చేస్తున్నప్పుడే అనేక రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. మాంసంలో ఎన్నో రకాల పదార్థాలు వేస్తుంటారు. అవన్నీ ఒక్కో రసాయనిక చర్య జరుపుతాయి. ఇవన్నీ మాంసం రుచి, రంగు మారడానికి కారణమవుతాయి. అలా వండిన మాంసాన్ని మర్నాడు మళ్లీ వేడి చేయడం కరెక్టు కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా రెండోసారి వేడి చేసినప్పుడు కెమికల్ రియాక్షన్స్ మరింత తీవ్రమై, కొన్ని హానికరమైన పదార్థాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
బ్యాక్టీరియా వృద్ధి: మనం కుక్ చేసిన ఆహారాన్ని పొయ్యిమీద నుంచి దించిన తర్వాత, అది చల్లారుతున్నకొద్దీ అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందడం మొదలవుతుంది. మాంసం క్వాలిటీని బట్టి తీవ్రమైన బ్యాక్టీరియా కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టాక్సిన్స్: కొన్ని రకాల బ్యాక్టీరియా వృద్ధి చెంది, అది మాంసంలో టాక్సిన్స్‌ను ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ టాక్సిన్స్ వేడి చేసినా కూడా నాశనం కావు. ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
ఫుడ్ పాయిజన్: పైన చెప్పిన కారణాలతో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తీవ్రమైన అనారోగ్యం, ఆస్పత్రిలో చేరడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.
అందుకే ఇలా చేయాలి :
- ఒకసారి వండిన మాంసాన్ని రెండుసార్లు వేడి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
- మాంసం కూర వండిన తర్వాత వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
- మటన్ కూర వండేటప్పుడే అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలి.
- పచ్చి మాంసాన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
- ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టి ఉంటే, దాన్ని బయటకు తీసిన తర్వాత వెంటనే వాడాలి.
ఇవి కూడా చదవండి :
సంక్రాంతి మటన్ ముక్క సరిగా ఉడకట్లేదా? - ఇలా చేస్తే మెత్తగా ఉడికిపోద్ది!