ETV Bharat / state

నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు - వెలుగులోకి సంచలన నిజాలు - NARSINGI TWIN MURDER CASE

జంట హత్యల కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు - ఇద్దరిని చంపి మధ్యప్రదేశ్‌ పారిపోయిన నిందితులు - మృతురాలు బిందు కొంతకాలంగా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తింపు

NARSINGI TWIN MURDER CASE
మృతులు అంకిత్‌, బిందు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 5:29 PM IST

Updated : Jan 16, 2025, 6:22 PM IST

Narsingi Twin Murder Case : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ జంట హత్యల కేసులో రాహుల్‌, రాజ్‌కుమార్, సుఖీంద్ర అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని చంపి నిందితులు మధ్యప్రదేశ్‌ పారిపోయినట్లు తెలిపారు. బిందు గత కొంతాలంగా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. అంకిత్‌ స్నేహితుడు రాహుల్ బిందును అసభ్యకరంగా తీసిన వీడియోతో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

కోపంతోనే చంపాలని ప్లాన్ : అంకిత్‌, బిందుపై కోపంతో వారిని చంపాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో రాజ్‌కుమార్‌, సుఖేంద్ర సాయంతో అంకిత్‌, బిందును రాహుల్ హతమార్చినట్లు వెల్లడించారు. వీరిద్దరిని చంపిన అనంతరం నిందితులు మధ్యప్రదేశ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో ముగ్గురిని పట్టుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

అదృశ్యమైనట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు : హత్యకు గురైన బిందు ఈ నెల (జనవరి) 3న అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన అంకిత్, సాకేత్‌పై ఈ నెల 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో వీరు మంగళవారం (జనవరి 14న) దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా వీరిని సంక్రాంతి పండుగ రోజే నిందితులు పక్కా ప్రణాళికతో దాడి చేసి హతమార్చడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

కత్తులతో పొడిచి, బండరాయితో బాది : పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఇద్దరూ దారుణహత్యకు గురైనట్టు గుర్తించారు. కత్తులతో పొడిచి అనంతరం బండ రాళ్లతో తలపై బాది హత్య చేసినట్టు ఆనవాళ్లున్నాయి. ఘటనా స్థలికి దూరంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలు గుర్తించి, అలాగే నిందితులను పట్టుకుంటామని గతంలోనే పోలీసులు వెల్లడించారు.

ఆ ఒక్క ఫోన్ కాల్​తోనే జంట హత్యలు! - రోడ్డున పడ్డ ముగ్గురు పిల్లలు

న్యూ ఇయర్ పార్టీ కోసం గోవా వెళ్లిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్ - కర్రలతో కొట్టి దారుణ హత్య

Last Updated : Jan 16, 2025, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.