Womens Premier League 2025 : ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ లవర్స్‌కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధం కానుంది. 2025 మహిళల ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్‌తో ఢీ కొట్టనుంది.
ఈ టోర్నీకి నాలుగు నగరాలు వేదిక కానున్నాయి. ముంబయి, బెంగళూరు, వడోదర, లఖ్‌నవూ స్టేడియాల్లో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగళూరు 8 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముంబయి వేదిక కానుంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
కాగా, ఫిబ్రవరి 14న మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్‌కు సంబంధించిన సెలబ్రిటీలు ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొని సందడి చేయనున్నారు. టైటిల్ కోసం మొత్తం 5 జట్లు టోర్నమెంట్లో పోటీపడనున్నాయి.
4⃣ Cities
— Women's Premier League (WPL) (@wplt20) January 16, 2025
5⃣ Teams
2⃣2⃣ Exciting Matches
Here's the #TATAWPL 2025 Schedule 🔽
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿𝘀 🗓️ pic.twitter.com/WUjGDft30y