Bharat NCAP Rating: సేఫ్టీ విషయంలో స్వదేశీ SUV తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా పెట్టింది పేరు. ఇటీవలే ఈ కంపెనీకి చెందిన మూడు వాహనాలు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించగా తాజాగా మరో రెండు ఈవీ కార్లు ఇదే జాబితాలో చేరాయి. దీంతో ప్రయాణికుల సేఫ్టీ విషయంలో మహింద్రా కార్లు బెస్ట్ అని కంపెనీ మరోసారి నిరూపించుకుంది.
భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ 'మహింద్రా XEV 9e', 'BE 6' ఎలక్ట్రిక్ SUVలకు 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఇచ్చింది. ఈ రెండు మహింద్రా బ్రాండ్ ఈవీ కార్లు అడల్ట్ అండ్ చైల్డ్ భద్రతా పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించాయి. BNCAP ఈ రెండు ఎలక్ట్రిక్ SUVల టాప్-స్పెక్ వేరియంట్లను పరీక్షించి రేటింగ్ అందించింది. ఈ సేఫ్టీ రేటింగ్ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న వీటి అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.
మహింద్రా XEV 9e: ఈ క్రాష్ టెస్ట్‌లో XEV 9e అడల్ట్ భద్రతలో 32 పాయింట్లకు గానూ 32 పాయింట్లు సాధించింది. అయితే చైల్డ్ సేఫ్టీ పరంగా ఇది 49 పాయింట్లకు 45 పాయింట్లనే సాధించగలిగింది. డిఫార్మబుల్ బారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ AOP టెస్ట్‌లో 16 పాయింట్లకు పూర్తిగా 16 పాయింట్లను సాధించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో BNCAP ఈ కారుకు 'OK' రేటింగ్‌ను ఇచ్చింది.
Safety ratings of Mahindra – XEV 9E.
— Bharat NCAP (@bncapofficial) January 16, 2025
The XEV 9E has scored 5-Star Safety Ratings in both Adult Occupant Protection (AOP) and Child Occupant Protection (COP) in the latest Bharat NCAP crash tests.#bharatncap #safetyfirst #safetybeyondregulations #morestarssafercars #drivesafe pic.twitter.com/Dux6tElRLG
మహింద్రా BE 6: XEV 9e మాదిరిగానే మహింద్రా BE 6 కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్‌తో ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్తమ BNCAP రేటింగ్‌లు కలిగిన కార్లలో ఒకటిగా మారింది. ఈ ఎలక్ట్రిక్ SUV అడల్ట్ ప్రయాణీకుల ప్రమాద భద్రతా రేటింగ్‌లో 32 పాయింట్లకు 31.97 పాయింట్లను సాధించింది. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 49కి 45 స్కోర్‌ను పొందింది.
Safety ratings of Mahindra – BE6.
— Bharat NCAP (@bncapofficial) January 16, 2025
The BE 6 has scored 5-Star Safety Ratings in both Adult Occupant Protection (AOP) and Child Occupant Protection (COP) in the latest Bharat NCAP crash tests.#bharatncap #safetyfirst #safetybeyondregulations #morestarssafercars #drivesafe pic.twitter.com/PjY1Q4cdeG
మహింద్రా XEV 9e, BE 6 భద్రతా ఫీచర్లు: మహింద్రా XEV 9e, BE 6 రెండింటినీ బ్రాండ్ INGLO ప్లాట్‌ఫామ్ ఆధారంగా తీసుకొచ్చారు. దీంతో ఇవి అనేక భద్రతా ఫీచర్లతో లెవల్ 2 ADAS సూట్‌తో వస్తాయి. ఈ సూట్ లేన్ ఛేంజ్, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.
దీనితో పాటు ఈ రెండు EVలు 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), TPMS, బ్లైండ్ వ్యూ మానిటర్, సేఫ్ 360 లైవ్ వ్యూ, రికార్డింగ్, ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ బ్రేక్ బూస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, కార్నరింగ్ ల్యాంప్, ఆటో బూస్టర్ ల్యాంప్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా కలిగి ఉన్నాయి.
కాగా కంపెనీ నుంచి ఇప్పటికే మహింద్రా థార్ రాక్స్, XUV400 EV, మహింద్రా 3XO వాహనాలు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి 'మహింద్రా XEV 9e', 'BE 6' ఎలక్ట్రిక్ SUVలు వచ్చి చేరాయి.
ప్రంపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌టీవీ లాంఛ్- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు!
చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు- సెల్ఫీలను స్టిక్కర్లుగా.. ఇకపై చాట్‌లో అన్లిమిటెడ్ ఫన్!