ATM Robbery In Karnataka : కర్ణాటకలో పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ ఏటీఎం వద్ద దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం రూ.93 లక్షలు ఉన్న నగదు బాక్స్‌తో ఇద్దురు దొంగలు పరారయ్యారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలను కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు
సీసీటీవీ ఫుటేజీ, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం
గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో బీదర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని శివాజీ చౌక్ వద్దనున్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ చోరీ జరిందని పోలీసులు తెలిపారు. సిసీటీవీ ఫుటేజీ ఆదారంగా, ఇద్దరు దొంగలు ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు ముందుగానే చేరుకున్నారు. ఆ ఏటీఎంలో నగదును పెట్టేందుకు వచ్చే వాహనం రాక కోసం వాళ్లిద్దరూ ఎదురు చూశారు. ఆ వాహనం వచ్చి ఆగిన తర్వాత, అందులోని డబ్బుల పెట్టెను సెక్యూరిటీ సిబ్బంది బయటికి తీశారు. ఏటీఎంలో క్యాష్‌ను లోడ్ చేసేందుకు డబ్బుల పెట్టెను తీసుకెళ్తుండగా, సెక్యూరిటీ సిబ్బందిపై దొంగలు ఆరు రౌండ్ల కాల్పులకు పాల్పడినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కాల్పులు జరిపిన అనంతరం నగదుతో కూడిన పెట్టెను దొంగలు తీసుకుని బైక్‌పై పరాయ్యారని పోలీసులు తెలిపారు.
సెక్యూరిటీ సిబ్బంది మృతి
గాయపడిని సెక్యూరిటీ సిబ్బందిని గమనించిన అక్కడి ప్రజలు, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గిరి వెంకటేశ్ అనే సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఏటీఎం, క్యాష్ వాహనానికి సంబంధించిన సెక్యూరిటీ గార్డులపై కారం పౌడర్‌ను స్ప్రే చేసిన తర్వాత దొంగలు ఫైరింగ్ చేసినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఆ ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.