తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పది నిమిషాల్లో పసందైన పచ్చి పులుసు - చాలా మందికి తెలియని టిప్స్! - Pachi Pulusu Recipe Making

Pachi Pulusu Recipe : త్వరగా రెడీ అయిపోయే వంటకాల్లో పచ్చి పులుసు ఒకటి. వేపుళ్లు, మసాలాల గోల లేకుండా చాలా సింపుల్‌గా ఎవరైనా సరే పచ్చి పులుసును చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఆ ప్రిపరేషన్‌ ప్రాసెస్‌ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 10:42 AM IST

Pachi Pulusu
Pachi Pulusu Recipe (ETV Bharat)

How To Make Pachi Pulusu :చాలా మందికి అన్నంలోకి కర్రీతోపాటుగా పచ్చి పులుసు కంపల్సరీ. కరకరలాడే పచ్చి ఉల్లిపాయ ముక్కలతో.. నోటికి పుల్ల పుల్లని రుచి తగులుతూ ఉండే ఈ పచ్చిపులుసును.. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, లేదా మరైనా వంటకంతో కలుపుకుని తింటే ఉంటది నా సామిరంగా.. చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే! అంత గొప్ప రుచిగా ఉంటుంది. అందుకే.. కొంత మంది ఇంట్లో ఎన్ని కూరలువండినా కూడా ఒక చిన్న గిన్నెలో పచ్చిపులుసు చేసుకుంటుంటారు. అయితే.. అందరికీ సూపర్ టేస్ట్​ రాదు. మరి.. అద్దిరిపోయే రుచికరమైన పచ్చిపులుసును ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • పచ్చి మిర్చి - 5
  • కొత్తిమీర కొద్దిగా
  • చింతపండు - 50 గ్రాములు
  • 1/2 టీస్పూన్- పసుపు పొడి
  • జీలకర్ర- టీ-స్పూన్
  • కరివేపాకు - నాలుగైదు రెమ్మలు
  • చిన్న టమాట
  • ఉల్లిపాయలు- రెండు
  • ఎండు మిర్చి - 3
  • ఉప్పు -సరిపడినంత

5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్​ జ్వరాలకు సూపర్ రెమిడీ!

పచ్చిపులుసు తయారీ విధానం :

  • ముందుగా ఒక స్ట్రెయినర్‌ సహాయంతో సన్నని మంట మీద 5 పచ్చిమిర్చిలను బాగా కాల్చుకోండి. వీటివల్ల పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుంది.
  • తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్‌ వేసి.. ఎండుమిర్చి, టీస్పూన్‌ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి.
  • ఈ ఎండుమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే కచ్చాపచ్చాగా దంచుకోండి. మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసిన దానికంటే.. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసుకుంటేనే పచ్చిపులుసు రుచి ఎక్కువగా ఉంటుంది.
  • ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కాల్చుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా నలుపుకోండి.
  • అలాగే ఒక పెద్ద గిన్నెలో చింత పండును 10 నిమిషాల సేపు నానబెట్టండి.
  • ఆ తర్వాత చింత పండు రసాన్ని మీ టేస్ట్‌కు సరిపోయే విధంగా పులుపు రుచి చూస్తూ నీళ్లను పోసుకోండి.
  • తర్వాత ఈ నీళ్లలో మెత్తగా నలిపిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే కరివేపాకు, సన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్‌ చేయండి.
  • మీకు నచ్చితే చిన్న టమాట ముక్కలను కూడా పచ్చిపులుసులో వేసుకోవచ్చు.
  • తర్వాత ఇందులో అర టీస్పూన్‌ పసుపు, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, ఎండు మిర్చి మిశ్రమం వేసి.. చేతితోనే బాగా కలుపుకోండి.
  • పచ్చిపులుసులోని పదార్థాలన్నింటినీ చేతితో నలుపుతూ కలపడం వల్ల.. పులుసు చాలా రుచిగా ఉంటుంది.
  • దీనిని వేడివేడి అన్నంలో పోసుకుని తింటే అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే! మీరు కూడా ఈ సింపుల్‌ రెసిపీని ట్రై చేయండి!

స్ట్రీట్​ ఫుడ్​ టేస్ట్ ఇంట్లో! - ఉల్లి పకోడీలు ఇలా చేసుకుంటే అద్దిరిపోతాయి!

ఛాయ్​ చేసినంత సులువుగా అద్దిరిపోయే "పనీర్ ఖీర్" - ఇలా ప్రిపేర్ చేసుకోండి

ABOUT THE AUTHOR

...view details