తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాలిటిక్స్​కు కేంద్ర మాజీ మంత్రి గుడ్​బై- క్లినిక్​ చూసుకుంటానంటూ హర్షవర్ధన్​ ట్వీట్​ - హర్షవర్ధన్ రాజకీయలకు గుడ్​బై

Harsha Vardhan Quits Politics : రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మరోవైప్ అభ్యర్థిగా ఎంపికైనా భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ పోటీ చేయలేనని వెల్లడించారు.

Harsha Vardhan Quits Politics
Harsha Vardhan Quits Politics

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 7:52 PM IST

Harsha Vardhan Quits Politics: బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డా. హర్షవర్ధన్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం 'ఎక్స్​'లో పోస్టు చేశారు. ఇక నుంచి దిల్లీ కృష్ణానగర్‌లోని తన క్లినిక్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హర్షవర్ధన్​ దిల్లీలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో చాందినీ చౌక్​ నుంచే విజయం సాధించారు. బీజేపీ ప్రకటించిన లోక్​సభ ఎన్నికల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

'మోదీ ప్రభుత్వంలో పని చేయటం గర్వకారణం'
'50 ఏళ్ల క్రితం పేదలకు సాయం చేయాలనే ఆశయంతోనే కాన్పూర్‌లోని జీఎస్‌వీఎమ్‌ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఆ తర్వాత ఆరెస్సెస్‌ సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఈ రెండు నా హృదయానికి దగ్గరగా ఉన్న పని చేశాను. పోలియో రహిత భారత్‌ కోసం, కరోనా రెండు విడతల్లో దేశ ప్రజలను కాపాడేందుకు నా వంతు కృషి చేశాను. ఇన్నేళ్ల నా రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నా' అని డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.

30 ఏళ్లు రాజకీయాల్లో
1993లో తొలిసారిగా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుంచి ఈఎన్‌టీ వైద్యుడైన డా.హర్షవర్థన్‌ విజయం సాధించారు. అనంతరం దిల్లీ ఆరోగ్య శాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే స్థానం నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు (1993, 96, 98, 2003, 2008, 2013) ఎమ్మెల్యేగా గెలిచారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారు. 2021లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. కరోనా సమయంలో దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

పోటీ చేయలేనన్న సింగర్‌ పవన్‌ సింగ్‌
బంగాల్‌లోని ఆసన్‌సోల్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ పోటీ చేయలేనని ఎక్స్ వేదికగా వెల్లడించారు. "నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి ఆసన్‌సోల్‌ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పోటీ చేయలేను" అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలియజేశారు. అయితే అందుకు కారణాలేమన్నది వెల్లడించలేదు. పవన్‌ అభ్యర్థిత్వంపై టీఎంసీతోపాటు స్థానికంగా విమర్శలు రావటం వల్లే పోటీ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో ఆసన్‌సోల్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి సీనియర్‌ నటుడు శతృఘ్నసిన్హా గెలుపొందారు.

బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​- వారణాసి నుంచి మోదీ పోటీ

10 రోజులు 12 రాష్ట్రాలు- 29 కార్యక్రమాలకు హాజరు- దేశంలో మోదీ సుడిగాలి పర్యటన

ABOUT THE AUTHOR

...view details