Saif Stabbing Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గతవారం దాడికి పాల్పడిన బంగ్లాదేశీయుడికి ఫేషియల్ రికగ్నిషన్ చేయాల్సి ఉందని ముంబయిలోని మెజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి, అరెస్టయిన నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ అలియాస్ మహ్మద్ రొహిల్లా అమీన్ ఫకీర్ (30) ఒక్కరేనా, కాదా అనేది తేల్చడానికి ఫేషియల్ రికగ్నిషన్ చేస్తామన్నారు. షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను శుక్రవారం ముంబయిలోని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.
ఈ కేసులో అరెస్టయిన వ్యక్తి (షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్) తండ్రి ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. "సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి నా కొడుకు కాదు. ఆ వ్యక్తి పోలికలతో ఉన్నాడనే నెపంతోనే నా కుమారుడిని అరెస్టు చేశారు" అని నిందితుడి తండ్రి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌కు ఫేషియల్ రికగ్నిషన్ చేయడానికి పోలీసులు కోర్టును అనుమతి కోరడం గమనార్హం.
EXCLUSIVE | VIDEO: Md Ruhul Amin Fakir, the father of Saif Ali Khan's alleged attacker, says the person in CCTV footage is different from his son.
— Press Trust of India (@PTI_News) January 24, 2025
" the arrested person is not my son.the photo that was shown and my son are not similar. my son keeps short hair and the person in… pic.twitter.com/v7ay1IqAZw
పోలీసుల వాదన
"సైఫ్ నివాసంలోని పాదముద్రలు, నిందితుడి పాదముద్రలు ఒకేలా ఉన్నాయా, లేదా అనేది మేం నిర్ధరణ చేసుకోవాల్సి ఉంది. సైఫ్ ఇంట్లోకి చొరబడిన సమయంలో నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ ధరించిన షూ ఇంకా రికవర్ కాలేదు. సైఫ్‌పై దాడికి వినియోగించిన కత్తిలోని మిగతా భాగాన్ని రికవర్ చేయాల్సి ఉంది. నిందితుడు విచారణలో మాకు సహకరించడం లేదు" అని కోర్టుకు పోలీసులు వివరించారు. "నిందితుడి వద్ద బంగ్లాదేశీ డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. అయితే అతడు విజయ్ దాస్ పేరుతో భారత్‌లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేసుకున్నాడు. ఇందుకోసం షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌కు సహకరించిన వారిని గుర్తించాల్సి ఉంది" అని న్యాయస్థానానికి ముంబయి పోలీసులు తెలిపారు.
#WATCH | Actor Saif Ali Khan attack case | | Accused Mohammad Shariful Islam Shehzad sent to Police custody till 29th January. Visuals of him being brought to the Bandra Police Station in Mumbai. pic.twitter.com/ChJh7OcCff
— ANI (@ANI) January 24, 2025
నిందితుడి తరఫు న్యాయవాదుల వాదన
అయితే పోలీసుల వాదనతో నిందితుడి తరఫు న్యాయవాదులు దినేశ్ ప్రజాపతి, సందీప్ షేర్ కహ్నే విభేదించారు. "అసలు సైఫ్‌పై దాడి జరిగిన ఘటనే నమ్మశక్యంగా లేదు. దాడి జరిగిన చాలాసేపటి తర్వాత సైఫ్ అలీఖాన్ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎందుకింత జాప్యం చేశారు? నిందితుడిని ఇంకా పోలీసులకు రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తే సరిపోతుంది" అని నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె.ఎస్.పాటిల్, ప్రసాద్ జోషి వాదనలు వినిపించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.సి.రాజ్‌పుత్, నిందితుడి పోలీసు కస్టడీ గడువును జనవరి 29 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
#WATCH | Actor Saif Ali Khan attack case | | Accused Mohammad Shariful Islam Shehzad sent to Police custody till 29th January.
— ANI (@ANI) January 24, 2025
Advocate Sandeep Sherkhane representing accused Mohammad Shariful Islam Shehzad says, " ...police presented the progress of the investigation...the… pic.twitter.com/j7UF19lIH1
జనవరి 16న ఘటన
దొంగతనం చేసేందుకు జనవరి 16న తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశీయుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ చొరబడ్డాడు. తనను పట్టుకోబోయిన సైఫ్‌పై అతడు కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అపార్ట్‌మెంట్ నుంచి దుండగుడు పారిపోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు జనవరి 19న నిందితుడిని అరెస్టు చేశారు.
'పట్టుకునేందుకు ట్రై చేస్తే కత్తితో పొడిచాడు' - దాడి ఎలా జరిగిందో చెప్పిన సైఫ్ అలీఖాన్!
హెల్ప్ చేసిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్- ప్రేమతో ఒక హగ్ ఇచ్చిన హీరో