తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు! - How to Make Egg Bread Bajji Recipe

Egg Bread Bajji : ఎగ్స్​తో ఎన్నో రకాల వంటలు చేస్తుంటాం. ఫ్రై, పులుసు, ఎగ్​ బుర్జీ.. ఇలా ఎన్నో చేస్తుంటాం. పిల్లలు కూడా ఎగ్స్​తో చేసిన వంటలను ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ సారి గుడ్డుతో కర్రీస్​ కాకుండా ఈ బజ్జీలు ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.

Egg Bread Bajji
Egg Bread Bajji (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 2:21 PM IST

Crispy and Tasty Egg Bread Bajji Recipe: చాలా మంది పిల్లలు పెద్దగా తినరు. వారికి ఏదో ఒకటి తినిపించాలని తల్లులు ఎంతగానే ప్రయత్నిస్తుంటారు. కానీ.. వారి ప్రయత్నం వృథా అవుతూ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా? అయితే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చిటికెలో పూర్తయ్యే ఎగ్​ బ్రెడ్​ బజ్జీ ప్రిపేర్ చేయండి. పిల్లలు ఇంకా కావాలని లాగించకపోతే అడగండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

ఎగ్​ బ్రెడ్​ బజ్జీకి కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - 1 టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • నీరు - సరిపడా
  • వంట సోడా - చిటికెడు
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా
  • బ్రెడ్​ స్లైస్​లు - 8
  • ఉడకబెట్టిన కోడిగుడ్లు - 4
  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 2
  • తురిమిన క్యాప్సికం ముక్కలు - పావుకప్పు
  • ధనియాల పొడి- అర టీ స్పూన్​
  • కారం - అర టీ స్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్​
  • గరం మసాలా - పావు టీ స్పూన్​
  • టమాట సాస్​ - ఒకటిన్నర టేబుల్​ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఎగ్​ బ్రెడ్​ బజ్జీ తయారీ విధానం:

  • ముందుగా స్టఫింగ్​ కోసం ప్రిపరేషన్​ చేసుకోవాలి. అందుకోసం స్టౌ మీద పాన్​ పెట్టి నాలుగు టేబుల్​ స్పూన్ల నూనె వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మూడు నిమిషాలు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి.
  • మసాలాలు మాడిపోకుండా నాలుగు టేబుల్​ స్పూన్ల నీరు పోసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత తరిగిన కొత్తిమీర తరుగు, టమాట సాస్​ వేసుకుని బాగా కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు మిల్క్​ బ్రెడ్​ లేదా శాండ్​విచ్​ బ్రెడ్​ స్లైస్​లు తీసుకుని నాలుగు వైపులా వాటి సైడ్స్​ కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బ్రెడ్​ స్లైస్​ తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని బ్రెడ్​ మధ్యలో పెట్టి కొద్దిగా స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • ఆ ఉల్లిపాయ మిశ్రమం మీద సగం కట్​ చేసిన కోడిగుడ్డును పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రైడ్​ స్లైస్​ అంచులను నీటితో కొద్దిగా తడపాలి.
  • అదే విధంగా మరో బ్రెడ్​ స్లైస్​ తీసుకుని మధ్యలోకి ఆనియన్​ మిశ్రమం పెట్టుకుని.. దాని అంచులను కూడా కొద్దిగా తడుపుకోవాలి.
  • ఇప్పుడు అంచులు తడుపుకున్న బ్రెడ్​ స్లైస్​ను ఎగ్​ మిశ్రమం పెట్టుకున్న బ్రెడ్​ స్లైస్​ మీద పెట్టి.. రెండు బ్రెడ్​ స్లైస్​ అంచులను అదిమితే తడి ఉండటం వల్ల అవి రెండూ అంటుకుంటాయి. ఇలా మిగిలిన బ్రెడ్​ స్లైస్​లన్నింటిని చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులోకి జల్లించిన శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, సోడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి సన్నని కొత్తిమీర తరుగు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బజ్జీలు వేసుకునేందుకు సరిపడే విధంగా బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. శనగపిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే ఎగ్​ బ్రెడ్​ బజ్జీలు అంత బాగా వస్తాయి. లేదంటే తినేటప్పుడు పిండి నోటికి అంటకపోతుంది.
  • ఇప్పుడు స్టౌమీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగానే ప్రిపేర్​ చేసుకున్న బ్రెడ్​ను శనగపిండిలో రెండు వైపులా బాగా డిప్​ చేయాలి.
  • ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసి ఒక నిమిషం పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత రెండో వైపు తిప్పి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్​ ముక్కలను వేయించుకోవాలి.
  • ఇప్పుడు నూనెలో నుంచి తీసిన బ్రెడ్​ను సగానికి కట్​ చేసుని సాస్​ లేదా పుదీనా చట్నీతో తింటే అద్దిరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details