CEC On Lok Sabha Election : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(EC) ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఒడిశాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాజీవ్ కుమార్ ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని చెప్పిన ఆయన ఎన్నికల వేళ నగదు ప్రవాహం, హింసకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను పక్కాగా సీల్ చేసి, గోదాములకు తరలించి మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని రాజీవ్ కుమార్ అధికారులకు సూచించారు.
'లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి- సుప్రీం సూచనలను పాటిస్తాం' - CEC On Lok Sabha Election
CEC On Lok Sabha Election : లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Published : Feb 17, 2024, 10:23 PM IST
|Updated : Feb 18, 2024, 7:24 AM IST
'సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా'
ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. సుప్రీంలో పెండింగ్‌లో ఉన్న ఈవీఎంలు లేకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు బదలిస్తూ 'తీర్పు రానివ్వండి ఒకవేళ అవసరమైతే కోర్టు సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు' అని ఆయన తెలిపారు.
ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం సమాచార హక్కును హరిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల బాండ్లపై విచారణ జరిపిన రాజ్యంగ ధర్మాసనం రెండు వేర్వేరు తీర్పులు ఉన్నాయని తెలిపింది. అందులో ఒకటి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, మరొకటి జస్టిస్ సంజీవ్ ఖన్నాది. అయితే రెండు తీర్పులు ఏకగ్రీవంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టాలనే కారణంతో సమాచార చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.