ETV Bharat / state

అక్రమ కట్టడాల కూల్చివేతలో వెనకడుగు లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ - RANGANATH ON IILEGAL CONSTRUCTIONS

జూబ్లీహిల్స్​లోని పలు కాలనీలలో స్థానికులతో కలిసి హైడ్రా బృందం పరిశీలన - ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీసిన కమిషనర్ రంగనాథ్

HYDRA VISIT IN JUBILEE HILLS
HYDRA COMMISSIONER RANGANATH (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 24 hours ago

Hydra in Jubilee Hills : హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై కేసుల నమోదుకు హైడ్రా పోలీస్ స్టేషన్​కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్​లోని నందగిరి హిల్స్, హుడాఎన్ క్లేవ్ కాలనీతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీల్లో తమ సిబ్బందితో కలిసి రెండు గంటలపాటు ఆయన పర్యటించారు.

పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం : ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీశారు. 2011లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొంత మంది ఆక్రమిస్తున్నారని బస్తీవాసులు రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. బస్తీని ఆనుకొని ఉన్న పార్క్ స్థలాన్ని కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ETV Bharat)

"ఇక్కడ ఉన్న ఎకరం 25 గుంటలను ముందుగా రక్షిస్తాం. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం కేటాయించిన స్థలంలో వారికి ఇళ్ల కట్టించే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ ముందుగా సర్వే చేసి ఆక్రమణలను గుర్తించి పార్కును కాపాడుతాం. ఇక్కడ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. వాటిని పూర్తిగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతాం" -హైడ్రా కమిషనర్ రంగనాథ్

కమిషనర్ వచ్చారనే విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గురుబ్రహ్మనగర్ బస్తీకి చేరుకున్నారు. అవసరమైతే ప్రభుత్వ స్థలంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని దానం హామీ ఇచ్చారు. హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అక్కడి పార్క్​లోని లేఔట్లను పరిశీలించి అక్రమంగా ఉన్నట్లయితే నిర్మాణాలను కూల్చివేయాలని సూచించారు.

సమగ్రంగా ఆధారాలను తనిఖీ చేస్తాం : మరోవైపు ఈ వ్యవహారంపై సమగ్ర సర్వే చేసి ఎకరా 25 గుంటల భూమిని తేల్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. బాధ్యులందరిని తమ కార్యాలయానికి పిలిపించి ఆధారాలను తనిఖీ చేస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించి పేదలకు న్యాయం చేసేలా చూస్తామని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు.

ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

నిబంధనలు పాటిస్తూనే ఆక్రమణలు కూల్చివేశాం : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.